రూ.1,199కే విమాన టికెట్!..ఏ కంపెనీ ఎనౌన్స్ చేసిందో తెలుసా?

విస్తారా ఎయిర్ లైన్స్ దేశీయ సర్వీసుల్లో 48 గంటల సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్‌ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా విమాన టికెట్‌ను రూ.1,199 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రయాణికులు అక్టోబర్ 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ […]

రూ.1,199కే విమాన టికెట్!..ఏ కంపెనీ ఎనౌన్స్ చేసిందో తెలుసా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 10, 2019 | 7:11 PM

విస్తారా ఎయిర్ లైన్స్ దేశీయ సర్వీసుల్లో 48 గంటల సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది. ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్‌ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా విమాన టికెట్‌ను రూ.1,199 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రయాణికులు అక్టోబర్ 10వ తేదీ నుంచి 2020 మార్చి 28వ తేదీ వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. ఫెస్టివల్ సీజన్ దృష్ట్యా ఈ ఆఫర్‌ను తీసుకు వచ్చినట్లు విస్తారా తెలిపింది. దసరా, దీపావళి.. ఫెస్టివల్ సీజన్ వ్యాపారులకు పెద్ద పండుగ. ఈ కాలంలో ఎక్కువగా సేల్స్ ఉంటాయి. వ్యాపారులు, ఈ-కామర్స్ దిగ్గజాలు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి విస్తారా ఎయిర్ లైన్స్ కూడా ఈ ఆఫర్ ప్రకటించింది.

ఈ సేల్ కింద కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుందని, గురువారం అక్టోబర్ 10, 2019 (గురువారం) నుంచి శుక్రవారం అంటే అక్టోబర్ 11 రాత్రి 11.59 నిమిషాల వరకు ఉంటుందని తన ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ల ద్వారా పండుగ సీజన్‌ను మరింత హ్యాపీగా చేస్తున్నామని, అలాగే తమ వ్యాపార అభివృద్ధికి మరింతగా తోడ్పడుతుందని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ అన్నారు. ఆఫర్ చేస్తున్న ప్రధాన మార్గాల్లో ఢిల్లీ – ముంబై, ముంబై – బెంగళూరు, ముంబై – గోవా, ఢిల్లీ – చెన్నై, ఢిల్లీ – బెంగళూరు ఉన్నాయి. కొత్త డెస్టినేషన్లు జోద్‌పూర్, ఉదయ్‌పూర్, పాట్నా, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఈ సేల్ వర్తిస్తుంది.

https://twitter.com/airvistara/status/1182145724374380544