AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేశంలో ఎయిర్ పోర్ట్ లేదు, సొంత కరెన్సీ లేదు.. ప్రజలంతా కూర్చుని తిన్నా తరగనంత ధనవంతులే.. ఎక్కడ ఉందంటే..

ప్రపంచంలో ధనిక దేశం అంటే అగ్రరాజ్యం అమెరికా అని అంటారు చాలా మంది.. అయితే వాస్తవానికి అమెరికా కంటే కూడా యూరోప్ లో ఉన్న ఒక చిన్న దేశం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం. ఆ దేశానికి కనీసం ఒక్క ఎయిర్ పోర్ట్ లేదు.. సొంత కరెన్సీ కూడా లేదు. అయినా సరే ఆ దేశం ధనిక దేశం. ఇక్కడ నివసించే జనాభా కంటే రెండు రెట్లు ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. మరి ఆ దేశం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఆ దేశంలో ఎయిర్ పోర్ట్ లేదు, సొంత కరెన్సీ లేదు.. ప్రజలంతా కూర్చుని తిన్నా తరగనంత ధనవంతులే.. ఎక్కడ ఉందంటే..
Liechtenstein
Surya Kala
|

Updated on: Jul 28, 2025 | 4:59 PM

Share

ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు అనగానే వెంటనే అమెరికా, స్వీడన్, డెన్మార్క్ మొదలైన దేశాల పేర్లు తలపునకు వస్తాయి. అయితే ఈ దేశాలకంటే కూడా ఓ చిన్న దేశం అత్యధిక ధనిక దేశం. ఆ దేశం పేరు లీచ్టెన్‌స్టెయిన్. ఈ విషయం చాలా మందికి తక్కువగా తెలుసు. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాలలో ఇది ఒకటి. ఈ చిన్న దేశానికి సంబంధించిన అనేక విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఆ దేశం గురించి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దేశం సంపన్న దేశం అయినప్పటికీ.. దీనికి విమానాశ్రయం లేదా దానికంటూ సొంత కరెన్సీ లేదు.. అయినా సరే దేశంలో అందరూ ధనికులే. అంతేకాదు ఆ పోస్ట్‌లో మరికొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Heluva | Motivation | Growth (@heluvamotivation)

లీచ్టెన్‌స్టెయిన్‌కు విమానాశ్రయం లేదు. సొంత కరెన్సీ లేదు.. పొరుగు దేశాల కరెన్సీనే ఉపయోగిస్తారు. అయితే ఈ దేశ ప్రజలు చాలా ధనవంతులు. అందుకే ఇక్కడ నేరాలు చాలా తక్కువ. దొంగ తనాలు జరగవు. మోసం చేయరు. మొత్తం దేశంలో 300 మంది పోలీసు అధికారులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న వారి సంఖ్య ఏడుగురు మాత్రమే. ఇది అత్యంత ధనిక దేశాలలో ఒకటి మాత్రమే కాదు, సురక్షితమైన దేశాలలో ఒకటి కూడా..

లీచ్టెన్‌స్టెయిన్ యూరప్‌లోని ఒక చిన్న దేశం. ఇది స్విట్జర్లాండ్ , ఆస్ట్రియా మధ్య ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 39,000. అంటే బెంగళూరులోని ఒక చిన్న ప్రాంతం జనాభా అంత. అయితే ఈ దేశంలో ఇప్పటి వరకూ ఉన్న కంపెనీలు 70,000 కంటే ఎక్కువ. తలసరి జీడీపీలో ఈ దేశం చాలా ఉన్నత స్థానంలో ఉంది. దీని తలసరి ఆదాయం ఒకటిన్నర లక్షల డాలర్లకు పైగా ఉంది. ఇది అమెరికా కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.

లీచ్టెన్‌స్టెయిన్ ఆదాయ వనరులు ఏమిటంటే

లీచ్టెన్‌స్టెయిన్‌కు ప్రధాన ఆదాయ వనరు ఆ దేశంలో పరిశ్రమలు, వ్యాపారాలు. ఈ దేశంలో పరిశోధనలకు, అభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల హైటెక్ వ్యాపారాలు ఇక్కడ జరుగుతాయి. దేశ జనాభాలో సగం మంది ప్రతిరోజూ ప్రయాణిస్తునే ఉంటారు. ఫలితంగా దేశానికి చాలా ఆదాయం లభిస్తుంది. అంతేకాదు ఈ దేశంలో అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంది.. ఇది పూర్తిగా ఉచితంగా విద్యని అందిస్తారు. ధనవంతుల ఆధిపత్యం ఉన్న ఈ దేశానికి విమానాశ్రయం లేదు. ఇక్కడ ప్రజలు పొరుగు దేశాలకు వెళ్లి విమానాలు ఎక్కుతారు.

మరిన్ని వ్యాపార వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.