Nita Ambani: నీతా అంబానీ తాగే వాటర్‌ బాటిల్‌ ధర రూ.27 వేలు ఉంటుందా? ఆ రూ.49 లక్షల బాటిల్‌ స్టోరీ ఏంటి?

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా వ్యాపార ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆమె తన వెంచర్‌లతో పాటు విలాసవంతమైన జీవనశైలి, అద్భుతమైన దుస్తులు, ఖరీదైన ఉపకరణాలు, క్వీన్ సైజ్ జీవితానికి ప్రసిద్ధి చెందింది. వారి సాదాసీదా వస్తువులు కూడా లక్షలు, కోట్ల విలువైనవి ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా పేరుగాంచిన నీతా అంబానీ తన విలాసవంతమైన..

Nita Ambani: నీతా అంబానీ తాగే వాటర్‌ బాటిల్‌ ధర రూ.27 వేలు ఉంటుందా? ఆ రూ.49 లక్షల బాటిల్‌ స్టోరీ ఏంటి?
Nita Ambani
Follow us
Subhash Goud

|

Updated on: Aug 17, 2024 | 9:15 AM

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా వ్యాపార ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆమె తన వెంచర్‌లతో పాటు విలాసవంతమైన జీవనశైలి, అద్భుతమైన దుస్తులు, ఖరీదైన ఉపకరణాలు, క్వీన్ సైజ్ జీవితానికి ప్రసిద్ధి చెందింది. వారి సాదాసీదా వస్తువులు కూడా లక్షలు, కోట్ల విలువైనవి ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా పేరుగాంచిన నీతా అంబానీ తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా తరచుగా దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె రోజువారీ ఉపయోగించే వస్తువులు కూడా సాధారణ విషయాలు కాదు. ఉదాహరణకు, ఆమె వాటర్ బాటిల్. నీతా అంబానీ అందమైన ఆకారంలో ఉన్న బాటిల్ నుండి నీళ్ళు తాగుతున్న ఫోటో ఇటీవల వైరల్ అయ్యింది.

అయితే తన అందాన్ని కాపాడుకోవడం కోసం, అలాగే ఆరోగ్యంగా ఉండటం కోసం నీతా అంబానీ ఖరీదైనా వాటర్‌ తాగుతుందని ప్రచారంలో ఉంది. ఒక ప్రచారంలో ఆమె తాగే 750 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ ధర రూ. 27 వేలకుపైగా ఉంటుందనే వార్త వైరల్‌ అయ్యింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనా నీళ్లు ఇవేనని, ఈ వాటర్‌ ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు చర్మం ఎప్పుడు కూడా మెరిసేలా ఉంటుందని, అంతేకాదు ఒత్తిడి సైతం దూరమవుతుందని ఈ వాటర్‌పై అనేక వార్తలు వచ్చాయి.

ఈ నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదని, వసంతకాలంలో ఫిజి, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశంలో ఏర్పడే గ్లాసియర్‌ల నుంచి సేకరిస్తారని, దాంతోపాటు ఖనిజ లవణాలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయని కూడా ప్రచారం భారీగానే జరిగింది. అయితే దీనిపై మీ సౌందర్య రహస్యానికి, ఇంత హుషారుగా ఉండానికి గల కారణాలు నీళ్లేనా అంటూ ఓ సందర్భంలో నీతా అంబానీనే తెలిసిన వాళ్లు ఒకరు అడిగారట. ఇది విన్న నీతా అంబానీ ఆశ్చర్యపోయారట. ఖరీదైన నీళ్లంటూ జరుగుతున్న ప్రచారమంతా వట్టిదేనని, ఇందులో నిజం లేదని స్పష్టం చేశారట. మొత్తం మీద ఇంత ఖరీదైన వాటర్ అని వెలువడిన వార్తలు ఫేక్.

ఇవి కూడా చదవండి

మరి రూ. 49 లక్షల వాటర్‌ బాటిల్‌ స్టోరీ ఏంటి?

కాగా, 2015లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో నీతా అంబానీ ఓ వాటర్ బాటిల్‌లోతో కనిపించారు. ఈ బాటిల్‌ ధర సుమారు రూ.49 లక్షలు అంటూ ఎవరో ఫోటో మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్‌లో వైరల్ చేశారు. ఈ బాటిల్‌ అసలు కథ ఏంటంటే.. ప్రముఖ మెక్సికన్ డిజైనర్, ఫెర్నాండో అల్టామిరానో ఈ బాటిల్‌ను నిజంగానే బంగారంతో చేశారు. దాని పేరే అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అయితే అయితే నీతా అంబానీ నీళ్లకు స్పష్టత ఇచ్చినట్లే బాటిల్‌కు కూడా ఏదైనా స్పష్టత ఇస్తారో చూడాలి.

Nita Ambani Water

Nita Ambani Water

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తాజాగా ఎంత పెరిగిందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి