SBI FD: ‘వీకేర్’.. డోన్ట్ కేర్ అంటూ వృద్ధులకు భరోసా ఇస్తున్న ఎస్బీఐ.. ఆ పథకం గడువు సెప్టెంబర్ 30 వరకూ పొడిగింపు..
ఈ పథకంపై వినియోగదారుల్లో ఉన్న డిమాండ్ రీత్యా మరోసారి గడువును పెంచింది. ఈ పథకం పేరు ఎస్బీఐ వీ కేర్ సీనియర్ సిటిజెన్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్క్రీమ్. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలవ్యవధిపై వస్తుంది. అధిక వడ్డీని అందిస్తోంది.

సురక్షిత పెట్టుబడి పథకాలలో అత్యంత ప్రజాదరణ పొందన పథకం ఫిక్స్ డ్ డిపాజిట్. ముఖ్యంగా వృద్ధులకు అధిక వడ్డీతోపాటు పన్ను రాయితీలు వస్తుంటాయి. బ్యాంకులతో పాటు, పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ పథకం ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోని అతి పెద్ద రుణ దాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓ ఫిక్స్ డ్ డిపాజిట్ ఫథకం అందిస్తోంది. ఈ ఖాతా ప్రారంభించే గడువును ముగిసిపోయినప్పటికీ, ఈ పథకంపై వినియోగదారుల్లో ఉన్న డిమాండ్ రీత్యా మరోసారి గడువును పెంచింది. ఈ పథకం పేరు ఎస్బీఐ వీకేర్ సీనియర్ సిటిజెన్ ఫిక్స్ డ్ డిపాజిట్ స్క్రీమ్. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలవ్యవధిపై వస్తుంది. అధిక వడ్డీని అందిస్తోంది. ఈ నెలాఖరుకు దీని గడువు ముగిసినప్పటికీ మరో మూడు నెలలపాటు దీనిని పొడిగించినట్లు ఎస్బీఐ ప్రకటించింది. అంటే సెప్టెంబర్ 30 వరకూ ఈ ఖాతాను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
2022లో ప్రారంభం..
సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకం ఈ ఎస్బీఐ వీకేర్ పథకం. దీనిని 2022లో బ్యాంకు ప్రారంభించింది. మెచ్యూరింగ్ డిపాజిట్లు, తాజా డిపాజిట్ల పునరుద్ధరణ కోసం ఈ పథకం ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
డిపాజిట్ వ్యవధి.. ఎస్బీఐ వీకేర్ పథకంలో కనీసం ఐదేళ్ల కాల వ్యవధితో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా పదేళ్ల వరకూ వ్యవధి పెట్టుకోవచ్చు.
ఎవరు అర్హులు.. ఎస్బీఐ నుంచి వస్తున్న ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ ప్లాన్‌కు 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మాత్రమే అర్హులు.
వడ్డీ రేటు.. బ్యాంక్ సాధారణ ప్రజలకు కార్డ్ రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) అదనపు ప్రీమియాన్ని అందిస్తుంది. సాధారణ ప్రజలకు కార్డ్ రేటు కంటే మొత్తం 100 బేసిస్ పాయింట్ల ప్రీమియం. ఎస్‌బీఐ వీకేర్‌పై వడ్డీ రేటు 7.50 శాతం. ప్రస్తుతం సీనియర్ సిటిజన్‌లకు సాధారణ రేట్ల కంటే 0.50 శాతం అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది, అయితే సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు కాల వ్యవధిలో 3.50 శాతం నుంచి 7.50 శాతం మధ్య మారుతాయి.
ఇతర బ్యాంకుల్లో అత్యధిక వడ్డీ ఇచ్చేది..
వృద్దులకు కేవలం ఎస్బీఐ మాత్రమే కాక ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు కూడా మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ అధిక వడ్డీని ఇస్తోంది. స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రీమియంపై 0.25 శాతం వడ్డీ రేటు అదనంగా అందిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న 0.50 ప్రీమియంకు అదనం. ఫలితంగా, సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్ డీ పథకంలో పెట్టుబడిదారులు సాధారణ క్లయింట్‌ల కంటే 0.75 శాతం ఎక్కువ వడ్డీని పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..