New UPI Rule: వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 ఇలాంటి ఫోన్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్!
UPI New Rules: మీ మొబైల్ నంబర్ ఇన్‌యాక్టివ్‌గా ఉండి అది మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉంటే, మీరు ఇకపై UPI సేవను ఉపయోగించలేరు. దీని అర్థం Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లను ఉపయోగించలేరు. ప్రతి వారం ఇన్‌యాక్టివ్ సంఖ్యల జాబితాను అప్‌డేట్ చేయాలని ఎన్‌పీసీఐ..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు యూపీఐ (UPI) సేవలు ఉపయోగిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సర్వీసుల విషయంలో కీలక మార్పులు జరుగనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త నియమాన్ని అమలు చేసింది. దీని ప్రకారం, ఈ కస్టమర్లు ఏప్రిల్ 1, 2025 నుండి యూపీఐ చెల్లింపులు చేయలేరు. వివిధ మోసాలు, మోసపూరిత సంఘటనలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది.
NPCI అందించిన సమాచారం ప్రకారం.. ఒక మొబైల్ నంబర్ 90 రోజుల పాటు డియాక్టివేట్ చేయబడితే, ఇకపై దాని నుండి యూపీఐ చెల్లింపులు చేయలేరు. ఈ మొబైల్ నంబర్ యూపీఐ అనుబంధ బ్యాంక్ ఖాతా నుండి డీలింక్ అవుతుంది. ఇది యూపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా ఉంచడంలో, అలాగే మోసాల నుంచి రక్షించడంలో ఉపయోగపడనుంది.
భద్రత లోపం:
UPIకి లింక్ చేసిన ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్‌ల వల్ల భద్రత లోపిస్తుంది. సాధారణంగా, ప్రజలు తమ మొబైల్ నంబర్‌లను మార్చినప్పుడు లేదా పాత నంబర్‌ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు. కానీ ఆ నంబర్‌లు లింక్ చేసిన UPI ఖాతాలు యాక్టివ్‌గానే ఉంటాయి. అలాంటి నంబర్‌లు దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఉపయోగించని మొబైల్ నంబర్‌ను సదరు టెలికాం కంపెనీ వేరే కొత్త వినియోగదారుకు కేటాయించినట్లయితే, UPI లావాదేవీలు ఆ నంబర్ ద్వారా జరుగుతాయి. అంటే, యూపీఐ లావాదేవీ డబ్బులు కొత్త వ్యక్తి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి నంబర్‌ల వల్ల మోసాలు పెరుగుతాయి.
90 రోజుల వ్యవధి:
టెలికాం కంపెనీలు కొత్త వినియోగదారులకు డీయాక్టివేట్ అయిన నంబర్లను అందిస్తుంటాయి. పాత కస్టమర్ యూపీఐ నంబర్ అదే మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడినప్పుడు, కొత్త వినియోగదారు దానిపై అనధికార లావాదేవీలు చేయవచ్చు. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇటువంటి మార్గాల ద్వారా కొన్ని మోసాలు గుర్తించిన తర్వాత ఎన్‌పీసీఐ (NPCI) ఇప్పుడు 90 రోజుల కాలపరిమితి పరిష్కారాన్ని తీసుకువచ్చింది.
మీ మొబైల్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే ఏం చేయాలి?:
మీ మొబైల్ నంబర్ ఇన్‌యాక్టివ్‌గా ఉండి అది మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉంటే, మీరు ఇకపై UPI సేవను ఉపయోగించలేరు. దీని అర్థం Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌లను ఉపయోగించలేరు. ప్రతి వారం ఇన్‌యాక్టివ్ సంఖ్యల జాబితాను అప్‌డేట్ చేయాలని ఎన్‌పీసీఐ అన్ని బ్యాంకులు, యూపీఐ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. నియమాలు పాటిస్తున్నారా లేదా అనేది ఇది నిర్ణయిస్తుంది. దీనివల్ల మోసం, మోసాలు నిరోధించవచ్చు. భవిష్యత్తులో వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను వారి యూపీఐ ఐడీతో లింక్ చేయడానికి ముందస్తు అనుమతి ఇవ్వాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి