AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Tax Regime: కొత్త ఆదాయ పన్ను విధానంలో పన్ను ఆదా చేయడానికి ఇలా చేస్తే సరి.. బోలెడు పన్ను ఆదా..

పన్నులను ఆదా చేయడానికి ఏ చెల్లింపు విధానం మంచిదనే విషయంలో ఎప్పుడూ పన్ను చెల్లింపుదారులను గందరగోళానికి గురిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో తగ్గింపుల కారణంగా పాత పన్ను విధానం మెరుగ్గా ఉంటుంది. ఇతర సందర్భాల్లో అయితే కొత్త పన్ను  చెల్లింపు విధానాన్ని ఎంచుకోవాలి.

New Tax Regime: కొత్త ఆదాయ పన్ను విధానంలో పన్ను ఆదా చేయడానికి ఇలా చేస్తే సరి.. బోలెడు పన్ను ఆదా..
Income Tax
Nikhil
|

Updated on: Feb 18, 2023 | 11:35 AM

Share

ప్రస్తుతం భారత ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులంతా కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకోవాలని సూచిస్తుంది. ముఖ్యంగా కేంద్రం ప్రకటించిన ఆదాయపు పన్ను మినహాయింపు శ్లాబ్ చేరాలంలో పన్ను చెల్లింపుదారులు కచ్చితం రూ.7 లక్షల శ్లాబ్‌లోకి చేరాల్సిందేనని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఇప్పుడు పాత విధానం మంచిదా? కొత్త విధానం మంచిదా? అనే ఆలోచన పన్ను చెల్లింపుదారులను వేధిస్తున్న ప్రశ్న. పన్నులను ఆదా చేయడానికి ఏ చెల్లింపు విధానం మంచిదనే విషయంలో ఎప్పుడూ పన్ను చెల్లింపుదారులను గందరగోళానికి గురిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో తగ్గింపుల కారణంగా పాత పన్ను విధానం మెరుగ్గా ఉంటుంది. ఇతర సందర్భాల్లో అయితే కొత్త పన్ను  చెల్లింపు విధానాన్ని ఎంచుకోవాలి. పాత పన్ను చెల్లింపు సెక్షన్లయిన 80 సి, 80 డి, 80 సీసీడీ వంటి సెక్షన్లు పెద్ద సంఖ్యలో తగ్గింపులను అందిస్తున్నప్పటికీ కొత్త పన్ను చెల్లింపు విధానంలో కూడా పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేయగలిగిన మరికొన్ని తగ్గింపులు ఉన్నాయి. 

స్టాండర్డ్ డిడక్షన్

2023 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని కొత్త పన్ను విధానంలో పొడిగించింది. దీని కోసం యజమానికి ఎలాంటి పత్రాన్ని సమర్పించకుండానే ఈ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. జీతంపై పన్నులను లెక్కించేటప్పుడు యజమాని స్వయంచాలకంగా ప్రామాణిక మినహాయింపును పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ మీరు కుటుంబ పెన్షనర్ అయితే, కొత్త పన్ను విధానంలో మీరు రూ. 15,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు. కుటుంబ పెన్షనర్‌కు వచ్చే ఆదాయంపై ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం మేరకు పన్ను విధిస్తారు. ప్రస్తుతం పాత విధానంలో ఉన్న ఈ తగ్గింపును కొత్త విధానంలో కూడా అనుమతిస్తున్నారు.

యజమాని ద్వారా ఎన్‌పీఎస్ సహకారం

మీ యజమాని మీ ఎన్‌పీఎస్ ఖాతాకు సహకరిస్తున్నట్లయితే, జీతం పొందే ఉద్యోగిగా, మీరు స్థూల ఆదాయం నుంచి చేసిన సహకారం కోసం మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హులు. ఈ మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీసీడీ (2) ప్రకారం క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు విరాళాలు

ఆదాయపు పన్ను చట్టంలోని కొత్తగా ప్రతిపాదించిన సెక్షన్ 80 సీసీహెచ్ ప్రకారం అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు చెల్లించిన లేదా డిపాజిట్ చేసిన ఏదైనా మొత్తాన్ని అగ్నివీర్ ఆదాయం నుంచి మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అంటే అగ్నిపత్ స్కీమ్ 2022లో నమోదు చేసుకున్న అగ్నివీర్ కార్పస్ ఫండ్ నుంచి అందుకున్న చెల్లింపు పన్నుల నుంచి మినహాయించబడాలని ప్రతిపాదించారు. అతని సేవా నిధి ఖాతాకు అతను లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన సహకారంపై అగ్నివీర్‌కు మొత్తం ఆదాయం గణనలో మినహాయింపు వస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం