Aditya Birla Sun Life Insurance: ఈ బీమా పథకంతో మీ జీవితానికి సంపూర్ణ భరోసా.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్యూరెన్స్ కంపెనీ ఓ ప్రత్యేకమైన పాలసీని ప్రకటించింది. దాని పేరు ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ ఇన్యూరెన్స్ అన్మోల్ సురక్షా కవచ్. 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు ఉన్న వారు పాలసీ తీసుకోవచ్చు.

మీరు మంచి లైఫ్ ఇన్యూరెన్స్ ప్లాన్ గురించి వెతుకుతున్నారా? అది కూడా షార్ట్ టైం అయితే బాగుండునని భావిస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్యూరెన్స్ కంపెనీ ఓ ప్రత్యేక మైన పాలసీని ప్రకటించింది. దాని పేరు ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ ఇన్యూరెన్స్ అన్మోల్ సురక్షా కవచ్. దీనిలో 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు ఉన్న వారు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో ప్రీమియం పేమెంట్స్, నిబంధనలు సులభతరంగా ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది. పాలసీ హోల్డర్లు టర్మ్ ప్లాన్ ని వారే నిర్ణయించుకోవచ్చని కూడా తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐదు సంవత్సరాల వరకూ కవర్..
ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ఏబీసీఎల్) అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ), పాలసీదారుల స్వల్పకాలిక రక్షణ అవసరాలను తీర్చడానికి అన్మోల్ సురక్ష కవచ్ ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్, లైఫ్, ప్యూర్ రిస్క్ ప్రీమియం. ఈ పథకం పాలసీ హోల్డర్‌ల స్వల్పకాలిక రక్షణ అవసరాల కోసం 5 సంవత్సరాల వరకు లైఫ్ కవర్‌ని అందిస్తోంది.
ఇవి ప్లాన్ వివరాలు..
స్వల్పకాలిక రక్షణ: పాలసీదారులు 2 నుంచి 5 సంవత్సరాల మధ్య స్వల్పకాలిక పాలసీ వ్యవధిని పొందేందుకు అర్హులు.
ప్రీమియం చెల్లింపు వెసులుబాటు: ఈ స్కీమ్ లో పాలసీ హోల్డర్‌లు వన్‌టైమ్ పేమెంట్ చేయవచ్చు. లేదా మొత్తం పాలసీ టర్మ్‌లో చెల్లించుకుంటూ ఉండొచ్చు.
సమ్ అష్యూర్డ్ ఆప్షన్స్: పాలసీ హోల్డర్‌లు వివిధ రకాల హామీ ఉన్న ఎంపికల నుండి ఎంచుకోవచ్చు (రూ. 50లక్షల నుంచి రూ. 2కోట్ల వరకు రూ.25 లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్లొచ్చు).
60 ఏళ్ల వరకు రక్షణ: పాలసీదారులు 60 ఏళ్ల వరకూ ఈ స్కీమ్ కింద రక్షణ పొందొచ్చు.
ఆందోళన లేని జీవితం..
అన్మోల్ సురక్ష కవచ్ గురించి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండీ సీఈవో కమలేష్ రావు మాట్లాడుతూ.. తమ తాజా ఆఫర్, అన్మోల్ సురక్ష కవచ్ పాలసీదారులకు సరసమైన ధరలకు స్వల్పకాలిక రక్షణను అందిస్తుందన్నారు. ఈ లైఫ్ కవర్ తీసుకొని ఆందోళన లేని సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..