New Rules: మార్చి 1 నుంచి మారనున్న నిబంధనలు.. వినియోగదారులపై మరింత భారం

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి. ఇక ఫిబ్రవరి నెల ముగియబోతోంది..

New Rules: మార్చి 1 నుంచి మారనున్న నిబంధనలు.. వినియోగదారులపై మరింత భారం
March 1 New Rules
Follow us

|

Updated on: Feb 26, 2023 | 4:23 PM

ప్రతి నెల కొత్త కొత్త నిబంధనలు మారుతుంటాయి. ముఖ్యంగా బ్యాకింగ్‌, గ్యాస్‌ సిలిండర్‌, ఆదాయపు పన్ను, ఈపీఎఫ్‌వో ఇలా ఎన్నో నిబంధనలు మారుతుంటాయి. ఇక ఫిబ్రవరి నెల ముగియబోతోంది. మార్చి నెల వస్తోంది. నిబంధనలు మారడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. మరి మార్చి నెలలో ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

  1. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు: ప్రతినెల ఒకటో తేదీన ఆయిల్‌ కంపెనీలు గ్యాస్‌ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. మార్చి 1న గ్యాస్‌ సిలిండర్ ధర పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.
  2. బ్యాంకు రుణాలు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెంచాయి. అయితే రుణాలను నిర్ణయించే బేస్‌ రేటు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులు ప్రకటించాయి. మరి మార్చి 1 నుంచి కొంత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సామాన్యులకు మరింత భారం కానుంది.
  3. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు: ఎస్‌బీఐకి చెందిన క్రెడిట్‌ కార్డు విభాగం ఇటీవల ఎస్‌బీఐ కార్డు కొత్త ఛార్జీలను ప్రకటించింది. పెంచిన కొత్త ఛార్జీలు మార్చి 17,2023 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఎవరైనా అద్దె చెల్లింస్తే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అదనంగా ట్యాక్స్‌ సైతం ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.99గా ఉండేది. ఇప్పుడు డబుల్‌ చేసింది.
  4. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్: సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్‌ ఖాతాదారులకు అధిక పెన్షన్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చింది ఈపీఎఫ్‌వో. దీంతో చందాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మార్చి 3, 2023 చివరి గడువుగా పేర్కొంది. ఎవరైనా అర్హులుగా ఉంటే గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. సోషల్‌ మీడియా ఫిర్యాదులు: ఇక సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు మూడు ఫిర్యాదులు అప్పీలేట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీలు మార్చి 1వ తేదీ నుంచి పని చేయనున్నాయి. ఈ కమిటీలు సోషల్ మీడియాలకు సంబంధించిన ఫిర్యాదులను కేవలం 30 రోజుల్లోనే పరిష్కరించనున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!