Car Sales: కార్ల కంపెనీలకు కాసులు కురిపించిన 2022.. రికార్డు స్థాయిలో సేల్స్.. అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవంటే..

కరోనా కారణంగా మూడేళ్లుగా సరైన సేల్స్ లేక డీలా పడిన ఆటోమొబైల్ రంగానికి 2022 సంవత్సరం పెద్ద ఉపశమనం ఇచ్చింది. అన్ని పెద్ద కంపెనీల దేశీయ ప్యాసెంజర్ వాహనాల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.

Car Sales: కార్ల కంపెనీలకు కాసులు కురిపించిన 2022.. రికార్డు స్థాయిలో సేల్స్.. అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవంటే..
Car Sales
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2023 | 6:20 PM

2022 సంవత్సరం ఆటో మొబైల్ ఇండస్ట్రీకి కాసులు కురిపించింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ప్యాసెంజర్ వెహికిల్(పీవీ) అమ్మకాల్లో గత మూడేళ్ల రికార్డును అధిగమించింది. మొత్తం ఏడాదిలో 3.793 మిలియన్ యూనిట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాదితో పోల్చితే దాదాపు 23.1 శాతం అధికం. దీనికి ప్రధాన కారణం కార్లకు డిమాండ్ పెరగడంతోపాటు అనువైన సెమీకండక్టర్ చిప్ లు అందుబాటులో ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు.

టాప్ లేపిన టాటా మోటార్స్..

కరోనా కారణంగా మూడేళ్లుగా సరైన సేల్స్ లేక డీలా పడిన ఆటోమొబైల్ రంగానికి 2022 సంవత్సరం పెద్ద ఉపశమనం ఇచ్చింది. అన్ని పెద్ద కంపెనీల దేశీయ ప్యాసెంజర్ వాహనాల అమ్మకాల్లో గణనీయమైన వ‌ృద్ధి నమోదైంది. దీనిలో టాటా మోటార్స్ అత్యధికంగా 58.2 శాతం వృద్ధి సాధించగా.. దీని తర్వాత స్థానంలో 40.2 శాతంతో కియా ఇండియా నిలిచింది. ఆ తర్వాత టోయోటా కిర్లోస్కర్ 22.6 శాతం వృద్ధి రేటు సాధించింది. దేశీయ కార్ల కంపెనీ దిగ్గజం మారుతీ సుజుకి కూడా కార్ల అమ్మకాల్లో 15.4 శాతం వృద్ధి కనబరచింది.

ఆల్ టైం రికార్డు సేల్స్..

ఈ సందర్భంగా మారుతీ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ 2022 లో మన ఆటో ఇండస్ట్రీ 3.79 మిలియన్ దేశీయ యూనిట్లను హోల్ సేల్ లో విక్రయించిందని చెప్పారు. ఇది గతేడాది విక్రయించిన 3.08 మిలియన్ యూనిట్లతో పోల్చితే 23.1 శాతం అధికమని తెలిపారు. ఒక క్యాలెండర్ ఇయర్ ఇంత మొత్తంలో అమ్మడవ్వడం ఇదే తొలిసారని.. ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుగా ఆయన పేర్కొన్నారు. ఇంతకు ముందు 2018లో 3.38 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో రికార్డు ఉందన్నారు. 2022లో దానిని బ్రేక్ చేస్తూ దానికన్నా 14 శాతం అధికంగా విక్రయాలు జరిగాయన్నారు. దేశీయంగా కార్లకు ఏర్పడిన డిమాండ్ కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..