Maruti Suzuki: కొంగొత్త హంగులతో మారుతి సుజుకీ స్విఫ్ట్.. లేటెస్ట్ మోడల్ కేవలం రూ. 6.50లక్షలకే..

మారుతి సుజుకీ స్విఫ్ట్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ స్విఫ్ట్ కారును మరింతగా అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. స్విఫ్ట్ 2024 వెర్షన్ గా ఇది మార్కెట్లోకి గురువారం లాంచ్ అయ్యింది. డిజైన్ విషయంలో పెద్దగా మార్పు చేయకపోయినా.. ఫీచర్ల విషయంలో మాత్రం ప్రధానంగా కొన్ని మార్పులు చేశారు.

Maruti Suzuki: కొంగొత్త హంగులతో మారుతి సుజుకీ స్విఫ్ట్.. లేటెస్ట్ మోడల్ కేవలం రూ. 6.50లక్షలకే..
Maruti Swift
Follow us

|

Updated on: May 10, 2024 | 4:37 PM

మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన కార్లలో మారుతి సుజుకీ కంపెనీవే ఎక్కువ ఉంటాయి. వాటిల్లో మరి ముఖ్యంగా మారుతి సుజుకీ స్విఫ్ట్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ స్విఫ్ట్ కారును మరింతగా అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. స్విఫ్ట్ 2024 వెర్షన్ గా ఇది మార్కెట్లోకి గురువారం లాంచ్ అయ్యింది. డిజైన్ విషయంలో పెద్దగా మార్పు చేయకపోయినా.. ఫీచర్ల విషయంలో మాత్రం ప్రధానంగా కొన్ని మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ కారుకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతి సుజుకీ స్విఫ్ట్ ఇంజిన్ సామర్థ్యం..

2024 అప్ డేటెడ్ స్విఫ్ట్ కారులో 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. అంతేకాక దీనిలో 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ ఇంజిన్ 80బీహెచ్పీ, 112 గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ కు 25.72 కిలోమీటర్ల మైలేజీని ఇది ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

మారుతి సుజుకీ స్విఫ్ట్ ఇంటీరియర్..

ఇక ఈ కారు ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ కారు లోపలి భాగంలో ఫ్రాంక్స్, బ్రెజ్జా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ వచ్చేలా క్యాబిన్ ను తీర్చిదిద్దారు. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్ మెంట్ ను అందిస్తోంది. టాప్ ఎండ్ మోడల్లో 9 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్, 360 డిగ్రీల కెమెరా, హెడ్ అప్ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జింగ్, కారు వెనుక సీట్ల వైపు ఏసీ వెంట్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు, సదుపాయాలు కల్పించారు.

భద్రతకు అధిక ప్రాధాన్యం..

అప్ డేటెడ్ స్విఫ్ట్ లో భద్రతకు అధిక ప్రాధన్యం ఇచ్చారు. దీనిలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అన్ని వేరియంట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లను అందిస్తోంది. ఇక డిజైన్ పరంగా చూస్తే పెద్దగా మార్పులు లేనప్పటికీ బంపర్ ను కాస్త మార్చారు. కొత్త గ్రిల్ ను అమర్చారు. ఎల్ఈడీ డీఆర్ఎల్ తో కలిసి హెడ్ ల్యాంప్ లను ఇచ్చారు. వెనుకభాగంలోనూ స్కిడ్ ప్లేట్ తో కూడిన కొత్త బంపర్ ఇచ్చారు. సీ-ఆకారపు డీఆర్ఎల్ తో ప్రత్యేకమైన లైట్లను దీనిలో ఉంచారు.

మారుతి సుజుకీ స్విఫ్ట్ ధర..

కొత్త స్విఫ్ట్ ధర రూ. 6.50లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 9.65లక్షల వరకూ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్‌ నివేదిక.. మరికొందరు నేతలపై కేసులు!
ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్‌ నివేదిక.. మరికొందరు నేతలపై కేసులు!
కాల్షియం కార్బైడ్‌తో పండిస్తున్న మామిడి పండ్ల తింటున్నారా..
కాల్షియం కార్బైడ్‌తో పండిస్తున్న మామిడి పండ్ల తింటున్నారా..
అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు..
అనుకూలంగా కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి రెండు మహా యోగాలు..
'బాహుబలి నన్ను రోడ్డున పడేసింది': జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్
'బాహుబలి నన్ను రోడ్డున పడేసింది': జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్
ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!
ఈ అవయవాలపై పుట్టుమచ్చలు ఉంటే.. అదృష్ట వంతులే!
టాప్-అప్ లోన్ అంటే ఏమిటి? ఎలాంటి ప్రాసెస్‌ లేకుండానే రుణం
టాప్-అప్ లోన్ అంటే ఏమిటి? ఎలాంటి ప్రాసెస్‌ లేకుండానే రుణం
నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని నిరసన
నీటి చుక్క కోసం మైళ్లదూరం నడక ప్రయాణం.. మోకాళ్లపై కూర్చొని నిరసన
వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై ప్రభావం చూపడం పక్కా..!
వృషభ రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశుల వారిపై ప్రభావం చూపడం పక్కా..!
ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే అంతే సంగతులు..
ఫేమస్ రెస్టారెంట్లని వెళ్తున్నారా.. ఫుడ్ చూస్తే అంతే సంగతులు..
ఎండు ద్రాక్ష నీరు ఇలా తాగారంటే.. 10 రోజుల్లోనే ఆ సమస్యలన్నీ పరార్
ఎండు ద్రాక్ష నీరు ఇలా తాగారంటే.. 10 రోజుల్లోనే ఆ సమస్యలన్నీ పరార్
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?