iVOOMi Jeetx ZE: మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్.. నేటి నుంచే బుకింగ్స్ ఓపెన్

ఈవీ వాహనాల్లో కూడా ఈవీ బైక్స్ కంటే ఈవీ స్కూటర్లు అధికంగా డిమాండ్ ఉంటున్నాయి. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఇవోమి జీటెక్స్ జెడ్‌ఈ పేరుతో సూపర్ మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్‌ను రిలీజ్ చేశారు. మరింత సౌకర్యం, మన్నిక, భద్రత, స్థోమత, ఉత్తేజకరమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

iVOOMi Jeetx ZE: మార్కెట్‌లోకి సూపర్ మైలేజ్‌నిచ్చే నయా ఈవీ స్కూటర్ లాంచ్.. నేటి నుంచే బుకింగ్స్ ఓపెన్
Ivoomi Jeetx Ze
Follow us
Srinu

|

Updated on: May 10, 2024 | 4:30 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ఈవీ వాహనాల్లో కూడా ఈవీ బైక్స్ కంటే ఈవీ స్కూటర్లు అధికంగా డిమాండ్ ఉంటున్నాయి. ప్రముఖ ఈవీ తయారీ సంస్థ ఇవోమి జీటెక్స్ జెడ్‌ఈ పేరుతో సూపర్ మైలేజ్‌ను ఇచ్చే ఈవీ స్కూటర్‌ను రిలీజ్ చేశారు. మరింత సౌకర్యం, మన్నిక, భద్రత, స్థోమత, ఉత్తేజకరమైన కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ధర, బుకింగ్

ఈ కొత్త స్కూటర్ 18 నెలల విస్తృతమైన పరీక్షల తర్వాత 100 కిమీ కంటే ఎక్కువ పరీక్షలతో రూపొందించారు. ఈ స్కూటర్ రూ. 79,999 ప్రారంభ ధర వద్ద ప్రారంభిస్తున్నారు. ఈ-స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 2.1 కేడబ్ల్యూహెచ్, 2.5కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో వచ్చే ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 170 కిమీ పరిధి అందిస్తుంది. ఈ స్కూటర్ నార్డో గ్రే, ఇంపీరియల్ రెడ్, అర్బన్ గ్రీన్, పెర్ల్ రోజ్, ప్రీమియం గోల్డ్, సెరూలియన్ బ్లూ, మార్నింగ్ సిల్వర్, షాడో బ్రౌన్ వంటి రి ప్రీమియం రంగులను ఎంచుకోవచ్చు. జీట్ఎక్స్ బుకింగ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభయ్యాయి. 

 ఇవోమి జీటెక్స్ జెడ్‌ఈ ఫీచర్లు 

ఇవోమి జీటెక్స్ జెడ్‌ఈ స్కూటర్ రోజు వారీ రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. బూట్ స్పేస్ రోజువారీ ప్రయాణాలకు అనువైనదిగా చేస్తుంది. జీట్ఎక్స్ జెడ్ఈ కేటగిరీలో 7 లేయర్ల భద్రత కలిగిన ఏకైక ఈ-స్కూటర్. ఇది బ్లూటూత్ ద్వారా వాహనంతో కనెక్ట్ అయ్యే చక్కగా రూపొందించిన యాప్, కస్టమర్లు ఎప్పుడైనా కీలక మెట్రిక్లను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. జెట్ఎక్స్ పేటెంట్ పొందిన జెన్- 3 బ్యాటరీ ప్యాక్ భారతదేశంలో తయారు చేశారు. ఈ-స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ 7 కేడబ్ల్యూ వరకు శక్తిని అందిస్తుంది. అయితే డిజైన్, ఇంజినీరింగ్ ఆవిష్కరణలు స్కూటర్ దాని ముందున్న మోడల్‌తో పోలిస్తే 20 శాతం తేలికగా చేస్తుంది. జెటెక్స్ ఈవీ స్కూటర్ 2.4 రెట్లు మెరుగైన శీతలీకరణ, మెరుగైన స్థల వినియోగాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్ 12 కేజీల రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అలాగే ఈ స్కూటర్ పోర్టబుల్ ఛార్జర్ కేవలం 826 గ్రాముల బరువుతో ఉండడం వల్ల ఛార్జింగ్‌ను చాలా సౌకర్యవంతంగా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి