Post Office Scheme: వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50 పెట్టుబడితో రూ. 31లక్షల సంపాదన..

వృద్ధాప్యంలో ఆర్థిక స్వతంత్రాన్ని కోరుకునే వారు ముందు నుంచి ప్రణాళిక కలిగి పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారికి ఇది సరిగ్గా సరిపోతోంది. వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఈ పథకం చేస్తుంది. ఇది కేవలం సేవింగ్స్ మాత్రమే కాక హెల్త్, లైఫ్ అస్యూరెన్స్ పాలసీ కావడం విశేషం. దీనిని 1955లో పోస్టాఫీసుల్లో ప్రారంభించారు.

Post Office Scheme: వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50 పెట్టుబడితో రూ. 31లక్షల సంపాదన..
Post Office Scheme
Follow us

|

Updated on: May 10, 2024 | 4:14 PM

పోస్ట్ ఆఫీసు పథకాలు అంటే ప్రజలకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉంటుండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వినియోగదారులకు పోస్ట్ ఆఫీసుల్లో అనేక పథకాలు అందుబాటులో ఉంటాయి. సేవింగ్స్ ఖాతాలతో పాటు అనేక రకాల పెట్టుబడి పథకాలు ఉంటాయి. వీటిల్లో కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా నిర్వహించే పథకాలు, అలాగే మరికొన్ని పోస్టాఫీస్ లే డైరెక్ట్ గా నిర్వహించే పథకాలు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో ప్రత్యేకత ఏమిటంటే చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి యువకులు, వృద్ధుల వరకూ అందిరికీ ఇక్కడ పథకాలు అందుబబాటులో ఉంటాయి. వాటిల్లో రిటైర్ మెంట్ ప్లానింగ్ కు సంబంధించిన ఓ పథకం వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఆ పథకం పేరు గ్రామ్ సురక్ష స్కీమ్. ఇది వృద్ధాప్యంలో మీకు అధిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకంలో ప్రయోజనం ఏమిటి? రాబడి ఎలా ఉంటుంది? అర్హతలు ఏమిటి? రోజుకు రూ. 50 పెట్టుబడి పెడితే రూ. 30లక్షలు ఎలా సంపాదిస్తారు? తెలుసుకుందాం రండి..

గ్రామ్ సురక్ష స్కీమ్..

వృద్ధాప్యంలో ఆర్థిక స్వతంత్రాన్ని కోరుకునే వారు ముందు నుంచి ప్రణాళిక కలిగి పొదుపు చేయాలనుకుంటారు. అలాంటి వారికి ఇది సరిగ్గా సరిపోతోంది. వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఈ పథకం చేస్తుంది. ఇది కేవలం సేవింగ్స్ మాత్రమే కాక హెల్త్, లైఫ్ అస్యూరెన్స్ పాలసీ కావడం విశేషం. దీనిని 1955లో పోస్టాఫీసుల్లో ప్రారంభించారు. ఈ స్కీమ్ లో చేరిన వ్యక్తి 80ఏళ్ల తర్వాత దాని ఫలాలు అందుకుంటాడు. పాలసీ తీసుకున్న వ్యక్తి మధ్యలోనే మరణిస్తే మొత్తం డబ్బులను నామినీకి లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఈ స్కీమ్ లో చేరేందుకు 19 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. దీనిలో ప్రీమియం మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాది ఒకసారి ప్రీమియం చెల్లింపులు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా పథకం మెచ్యూరిటీ 55 ఏళ్లు, 58ఏళ్లు, 60 ఏళ్లు ఉంటుంది. వీటిల్లో మీ వయసును బట్టి వ్యవధి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

రోజుకు రూ. 50తో రూ. 30లక్షలు..

గ్రామ్ సురక్ష స్కీమ్ ద్వారా చాలా ప్రయోజనాలు అందుతాయి. మీరు 19ఏళ్ల వయసులో పథకాన్ని ప్రారంభించి, రూ.10లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నారని అనుకోండి. దానికి 55ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తే.. మెచ్యూరిటీ తర్వాత మీకు రూ. 31.60లక్షల రాబడి వస్తుంది. దీని కోసం మీరు నెలకు రూ. 1515 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిని రోజుకు లెక్కిస్తే కేవలం రూ. 50 అవుతుంది. అంటే మీరు రోజుకు రూ. 50 పెట్టుబడితో ఏకంగా రూ. 31.6లక్షలను సంపాదించొచ్చు అన్నమాట. అదే సమయంలో మీరు రూ. 10లక్షల ప్రీమియాన్ని 58ఏళ్ల కాల వ్యవధితో తీసుకుంటే మీకు రూ. 33.4లక్షలు, అలాగే 60ఏళ్ల వ్యవధి తీసుకుంటే రూ. 34.60లక్షలు మెచ్యూరిటీ సమయంలో వస్తుంది. ఈ స్కీమ్ గురించిన మరింత సమాచారం కోసం మీ సమీపంలోని పోస్టాఫీస్‌ను సంప్రదించవచ్చు. ఈ పథకంలోని మరో ప్రయోజనం ఏమిటంటే ఈ పథకం ద్వారా రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. పాలసీ తీసుకున్న నాలుగేళ్ల తర్వాత రుణం పొందే అవకాశం ఉంది. ఈ రుణంపై 10శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ