Aadhaar Sim Card Scam: ఆధార్, సిమ్ కార్డ్ లింక్ పేరుతో నయా మోసం.. రూ.80 లక్షలు హాంఫట్

తాజాగా చండీగఢ్‌కు చెందిన ఒక మహిళ ఓ కొత్త తరహా స్కామ్‌ ద్వారా మోసపోయిది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న మోసగాళ్ల చేతిలో రూ.80 లక్షలు కోల్పోయింది. ముఖ్యంగా ఆధార్, సిమ్ కార్డు లింక్ లేదని బాధితురాలిని బెదిరించి మోసానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆధార్-సిమ్ కార్డు లింక్‌ పేరుతో జరిగిన మోసం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Aadhaar Sim Card Scam: ఆధార్, సిమ్ కార్డ్ లింక్ పేరుతో నయా మోసం.. రూ.80 లక్షలు హాంఫట్
Aadhaar scams
Follow us

|

Updated on: Jul 11, 2024 | 4:30 PM

భారతదేశంలో ప్రస్తుతం వివిధ రకాల ఆన్‌లైన్ స్కామ్‌లు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. రోజూ వేలాది మంది వ్యక్తులు లక్షలు, కోట్ల రూపాయల డబ్బును కోల్పోయారు. ప్రజలను మోసం చేయడానికి, వారి డబ్బును దొంగిలించడానికి స్కామర్లు నిరంతరం కొత్త ఉపాయాలను అమలు చేస్తున్నారు. తాజాగా చండీగఢ్‌కు చెందిన ఒక మహిళ ఓ కొత్త తరహా స్కామ్‌ ద్వారా మోసపోయిది. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న మోసగాళ్ల చేతిలో రూ.80 లక్షలు కోల్పోయింది. ముఖ్యంగా ఆధార్, సిమ్ కార్డు లింక్ లేదని బాధితురాలిని బెదిరించి మోసానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆధార్-సిమ్ కార్డు లింక్‌ పేరుతో జరిగిన మోసం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

చండీగఢ్‌లోని సెక్టార్ 11 నివాసి అయిన బాధితురాలికి ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ నుంచి పోలీసు అధికారి పేరుతో అనే వ్యక్తి నుండి కాల్ వచ్చింది. తన ఆధార్ కార్డుకు లింక్ అయిన సిమ్ కార్డును అక్రమ మనీలాండరింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు చెప్పాడు బాధితురాలికి ఆమెపై 24 మనీలాండరింగ్ ఫిర్యాదులు ఉన్నాయని తెలియజేశాడు. అందువల్ల అరెస్టు తప్పదని హెచ్చరించాడు. భయాందోళనకు గురైన మహిళ కేసుల నుంచి బయటకు వచ్చేలా చూడాలని రిక్వెస్ట్ చేసింది. విచారణలో భాగంగా ఆమె నిర్దోషి అని తేలితే డబ్బు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చి నిర్దేశిత బ్యాంకు ఖాతాలో రూ.80 లక్షలు డిపాజిట్ చేయాలని కాల్ చేసిన వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఆ సొమ్మును డిపాజిట్ చేసింది. అనంతరం స్కామర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో ఆ మహిళ మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి రక్షణ ఇలా

  • కాలర్ గుర్తింపును ఎల్లప్పుడూ ధ్రువీకరించుకోవాలి. నిజమైన అధికారులు ఫోన్‌లో వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు అడగరనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మనకు కాల్ చేసిన వ్యక్తి ఏ పేరుతో సొమ్ము అడుగుతున్నాడో..? సంబంధిత ఆఫీస్‌కు వెళ్లి వ్యక్తిగతంగా ధ్రువీకరించుకోవాలి. 
  • ఆధార్ నంబర్‌లు, బ్యాంక్ వివరాలు లేదా ఓటీపీల వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో ఎప్పుడూ షేర్ చేయవద్దు. చట్టబద్ధమైన సంస్థలు ఈ పద్ధతిలో అలాంటి సమాచారాన్ని అభ్యర్థించవు.
  • ముఖ్యంగా మీరు కాలర్ చెప్పిన పని చేయకపోతే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని భయపెడితే అస్సలు ఆ పని చేయవద్దు. ఎలాంటి చర్యకైన నిర్ధిష్ట ప్రొసీజర్ ఉంటుందని గమనించాలి. 
  • మీకు అనుమానాస్పద కాల్ వస్తే ఏదైనా చర్య తీసుకునే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా విశ్వసనీయ మూలాధారాలను సంప్రదించాలి. రెండో అభిప్రాయం తరచుగా తొందరపాటు నిర్ణయాన్ని నిరోధించవచ్చు.
  • ఏవైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు, మీ సర్వీస్ ప్రొవైడర్‌కు రిపోర్ట్ చేయాలి. ముందస్తు రిపోర్టింగ్ తదుపరి స్కామ్‌లను నిరోధించడంలో సహాయపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..