AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rules: జీతం తీసుకునేవారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కేంద్రం కొత్త రూల్స్.. తగ్గనున్న టేక్ హోం శాలరీ..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. దీంతో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ నియమావళి వర్తింపచేయనున్నారు. దీంతో పాటు కొత్త రేబర్ కోడ్స్ వల్ల జీతాలు పొందేవారికిపై ప్రభావం చూపనుంది. టేక్ హోం శాలరీ తగ్గి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుంది.

New Rules: జీతం తీసుకునేవారికి బ్యాడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కేంద్రం కొత్త రూల్స్.. తగ్గనున్న టేక్ హోం శాలరీ..
Salary
Venkatrao Lella
|

Updated on: Mar 22, 2026 | 11:30 AM

Share

ఏప్రిల్ 1 రావడానికి మరో తొమ్మిది రోజుల సమయమే మిగిలి ఉంది. ఆ రోజు నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం అమల్లోకి రానుంది. దీంతో దేశ ప్రజలను ప్రభావితం చూసే అనేక కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటి గురించి దేశంలోని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. జీతాలు పొందేవారితో పాటు ఈపీఎఫ్‌ ఖాతా ఉన్నవారిని ప్రభావితం చేసే అనేక మార్పులు జరగనున్నాయి. జీతం పొందేవారికి టేక్ హోం శాలరీ తగ్గనుండగా.. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరగనుంది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్, కొత్త లేబర్ కోడ్స్‌తో అనేక మార్పులు రానున్నాయి. మీరు నెలనెలా జీతం పొందుతుంటే.. మీపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనేది చూద్దాం.

తగ్గనున్న టేక్ హోం శాలరీ

కేంద్ర కొత్త వేతన నిబంధనలు తీసుకొస్తోంది. ఈ నిబంధనల ప్రకారం బేసిక్ శాలరీ అనేది మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం తప్పనిసరిగా ఉండాలి. దీని వల్ల బేసిక్ శాలరీ పెరిగితే.. మీ పీఎఫ్ నెలవారీ చందా కూడా పెరుగుతోంది. దీని వల్ల టేక్ హోమ్ శాలరీ తగ్గి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతోంది. దీని వల్ల దీర్ఘకాలంలో పీఎఫ్ అకౌంట్ ద్వారా మీ సేవింగ్స్ పెరుగుతాయి. రిటైర్మెంట్ సమయానికి మీ అకౌంట్లో నగదు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీకు ఆర్ధిక భరోసా అనేది ఉంటుంది.

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు

ఇక లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతూ ఊరటనిచ్చింది. మీరు ప్రైవేట్ ఉద్యోగులు అయితే పన్ను మినహాయింపులు పొందవచ్చు. బేసిస్ శాలరీ, అలవెన్సులు, పన్ను కోతలు అన్నీ కొత్త నిబంధనల ఆధారంగా మారిపోతాయి. మీరు దీర్ఘకాలంలో పన్ను ఆదా చేసుకోవడానికి కొత్త రూల్స్ ఉపయోగపడతాయి.

కొత్త పన్ను విధానం

ఇక పన్ను విధానంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పాతన పన్ను విధానంలో మీరు ఎంచుకున్నట్లయితే.. ఆటోమేటిక్‌గా కొత్త ట్యాక్స్ రెజిమీలోకి మారతారు. కొత్త పన్ను విధానంలోనే మీ ట్యాక్సులు లెక్కిస్తారు. దీని వల్ల మీకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉండవు. అయితే పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఉద్యోగులకు ఊరట లభించనుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 1 నంచి ఈ రూల్స్ అన్నీ వర్తింపచేయనున్నారు. దీంతో జీతం తీసుకునేవారు, ట్యాక్సులు చెల్లించేవారి విషయంలో మార్పులు జరగనున్నాయని చెప్పవచ్చు. కేంద్రం గత నవంబర్‌లో కొత్త కార్మిక కోడ్స్‌ను తీసుకొచ్చింది.  వీటి ఆధారంగా చాలా మర్పులు రాబోతున్నాయి.  ఈ మార్పులతో ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉండనున్నాయని చెప్పవచ్చు.

Follow Us