AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే.. కొత్తగా 3 ఎలివేటెడ్‌ కారిడార్లు

నిత్యం రోడ్లపై వాహనాల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొనే హైదరాబాద్‌ ప్రజలకు ఇదో భారీ ఊరటనిచ్చే వార్తనే చెప్పాలి. ఎందుకంటే నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ నుంచి రిజనల్ రింగ్‌ రోడ్డును కలిపేలా మూడు కొత్త ఎలివేటెడ్ కారిడార్లు, రెండు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రభుత్వం నిర్మించునంది. వీటి నిర్మాణం పూర్తైయితే నగర శివారు నుంచి నగరంలోకి రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంది.

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే.. కొత్తగా 3 ఎలివేటెడ్‌ కారిడార్లు
Hyderabad traffic solutions
Anand T
|

Updated on: Mar 22, 2026 | 11:22 AM

Share

హైదరాబాద్‌ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నగరాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ , పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అనే రెండు భాగాలుగా విభజించి అభవృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్‌ రోడ్డు నుంచి కొత్తగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్‌ రోడ్డు మధ్య రవాణా వ్యవస్థను మరింత అభివృద్ది చేయాలనుంది. ఈ రెండింటిని అనుసందానం చేసేలా కొత్తగా ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగ్గా, వీటి నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

నగరంలో కొత్తగా నిర్మించనున్న 3 ఎలివేటెడ్ కారిడార్లు ఇవే!

కారిడార్-1: ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వం పారడైజ్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు తొలి ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనుంది. మొత్తం రూ. 1,478 కోట్లతో వ్యయంతో సుమారు 5.40 కి.మీ మేర కారిడార్ నిర్మాణం జరగనుంది. అలాగే ఈ కారిడార్‌లో 500 మీటర్ల మేర అండర్ పాస్‌ కూడా నిర్మించనున్నారు.

కారిడార్-2: పారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు రెండో ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రభుత్వం నిర్మించనుంది. మొత్తం రూ.4,263 కోట్లతో 18.18 కి.మీ మేర ఈ కారిడార్ నిర్మాణం జరగనుంది.

కారిడార్-3: ఇక బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు మూడో కారిడార్‌ను నిర్మించనున్నారు. మొత్తం రూ.1,656 కోట్ల వ్యయంతో 9 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌ను నిర్మానం జరగనుంది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తైయితే ట్రాఫిక్ మరింత సులభతరం కానుంది.

రెండు రేడియల్ రోడ్ల నిర్మాణం 

ఇక హైదరాబాద్‌ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మరో రెండు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ రావిర్యాల నుంచి ట్రిపుల్ ఆర్ ఆమన్‌గల్ వరకు 41.5 కిలోమీటర్ల మేర ఒక రేడియల్ రోడ్‌, ఓఆర్ఆర్ బుద్వేల్ నుంచి నాచారం నేషనల్ 167ను వరకు రెండో రేడియల్ రోడ్డును నిర్మించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us