AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ హీరోలందరూ నల్లగానే ఉంటారు.. సక్సెస్‌కు కలర్ అడ్డుకాదు

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకున్న ఆ అందాల తార. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ మెప్పించింది. ప్రస్తుతం సహాయక పాత్రలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

అక్కడ హీరోలందరూ నల్లగానే ఉంటారు.. సక్సెస్‌కు కలర్ అడ్డుకాదు
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 10:53 AM

Share

సినిమా ఇండస్ట్రీలో అందం అనేది చాలా ముఖ్యం అని కొంతమంది.. లేదు నటన ప్రతిభ ఉంటే చాలు అని మరికొంతమంది చర్చించుకుంటూ ఉంటారు .. తాజాగా ఓ హీరోయిన్ చిత్ర పరిశ్రమలో నటీనటుల చర్మ రంగు ఆధారంగా అవకాశాలు వస్తాయా.? లేదా అనేదాని పై అభిప్రాయాలను పంచుకుంది. సాధారణంగా కొందరు నటీనటులు చర్మ రంగు కారణంగా వివక్షకు గురవుతున్నారని, లేదా తెల్లగా ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయా.? అనే దాని పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రతారలలో ఎవరూ యూరోపియన్ రంగులో లేరని ఆమె స్పష్టం చేశారు. ఆమె ఎవరంటే..

ఆమె మరెవరో కాదు ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ కస్తూరి శంకర్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉత్తరాది నుంచి, కేరళ నుంచి హీరోయిన్లు రావడం ఒక ఫేజ్ అని, అయితే ఇప్పుడు ఉత్తరాది హీరోయిన్ల ప్రాబల్యం తగ్గిపోయిందని ఆమె అన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని ఆమె వివరించారు. అప్పటి డైరెక్టర్లకు, హీరోలకు అటువంటి టేస్ట్ ఉండేదని, బాలీవుడ్ హీరోయిన్లను పెట్టుకుంటే ఒక క్రేజ్ ఉంటుందనే భావన ఉండేదని ఆమె తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమాలు బాలీవుడ్‌లో కూడా ఆదరణ పొందుతున్నాయని, రష్మిక మందన్న వంటి మన నటీనటులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారని కస్తూరి తెలిపారు.

ఇవి కూడా చదవండి

రష్మిక సౌత్ ఇండియన్ లుకింగ్ గర్ల్ అని, మనకు దగ్గరగా ఉండే అమ్మాయి అని పేర్కొంటూ, ఆమె ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని తెలిపారు. ఆమె ఆదరణకు చర్మ రంగు అడ్డుకాదని కస్తూరి అన్నారు. ఒకప్పుడు సుహాసిని, సరిత, భానుప్రియ వంటి అగ్ర నటీమణులు కూడా ఎంతో గొప్ప ఆదరణ పొందారని గుర్తు చేశారు. హీరోల విషయానికి వస్తే, ప్రేక్షకులు తమ రంగులో ఉండే వారినే ఎక్కువగా ప్రేమిస్తారని, వారితోనే ఒక కనెక్ట్ ఏర్పడుతుందని కస్తూరి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, తెల్లగా ఉన్న వారికి కొన్ని పరిమితులు ఉన్నాయని ఆమె అన్నారు. వారికి  చాక్లెట్ బాయ్ రోల్స్ తప్ప ఇతర పాత్రలు చేయడం కష్టం అవుతుందని ఆమె అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని కస్తూరి అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ వంటి స్టార్ హీరోలు ద్రావిడియన్ కలర్ లో ఉన్నారని, కేవలం అజిత్ వంటి ఒకరో ఇద్దరో మాత్రమే కొంచెం తెల్లగా ఉంటారని ఆమె పేర్కొన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us