AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PhonePe UPI: ఫోన్‌పేలో అందుబాటులోకి నయా ఫీచర్.. ఇక వ్యాపారులకే పండగే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు పెరగడంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ యూపీఐ యాప్స్ ఎక్కువ ప్రజాదరణ పొందినా ఫోన్‌పేను మాత్రం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. పేమెంట్స్ సింపుల్‌గా అవ్వడంతో పాటు వివిధ వ్యాపారులు కూడా ఫోన్‌పే పేమెంట్లు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తూ ఉండడంతో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఫోన్‌పే కూడా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తుంది

PhonePe UPI: ఫోన్‌పేలో అందుబాటులోకి నయా ఫీచర్.. ఇక వ్యాపారులకే పండగే..!
Phonepe
Nikhil
|

Updated on: Aug 25, 2024 | 7:00 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో డిజిటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్లు పెరగడంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ యూపీఐ యాప్స్ ఎక్కువ ప్రజాదరణ పొందినా ఫోన్‌పేను మాత్రం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. పేమెంట్స్ సింపుల్‌గా అవ్వడంతో పాటు వివిధ వ్యాపారులు కూడా ఫోన్‌పే పేమెంట్లు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తూ ఉండడంతో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఫోన్‌పే కూడా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. ఫోన్‌పే ఇటీవల తన యాప్‌లో ‘క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా వారి బ్యాంకుల నుంచి క్రెడిట్ లైన్‌లను పొందే వినియోగదారులు ఇప్పుడు ఈ క్రెడిట్ లైన్‌లను ఫోన్‌పేలో యూపీఐకు లింక్ చేయవచ్చు. తద్వారా వ్యాపారుల చెల్లింపులను సజావుగా చేయవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే తీసుకొచ్చిన తాజా ఫీచర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఫోన్‌పే క్రెడిట్ లైన్ ఫీచర్ వినియోగదారులను మిలియన్ల కొద్దీ వ్యాపారులలో సులభంగా కొనుగోళ్లు చేయడానికి, వారి నెలవారీ ఖర్చులను మెరుగ్గా నిర్వహించడంలో సహాయపడే స్వల్పకాలిక క్రెడిట్ సౌలభ్యాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యూపీఐకు సంబంధించిన పరిధిని విస్తరించిన తర్వాత క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐను అని పిలిచే ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌లను చేర్చడం ద్వారా వినియోగదారులు బ్యాంకుల ద్వారా క్రెడిట్ లైన్‌లను పొందేందుకు, వారి యూపీఐ యాప్‌ల ద్వారా వీటిని ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇది క్రెడిట్ లైన్లను ఉపయోగించుకునే వ్యాపారుల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది.

వినియోగదారులతో పాటు ఫోన్‌పే పేమెంట్ గేట్‌వేలోని వ్యాపారులు కూడా తమ కస్టమర్‌లకు చెక్‌అవుట్ సమయంలో అదనపు చెల్లింపు ఎంపికను అందించడానికి ఈ ఎంపిక అనుమతిస్తుంది. అయితే ఈ ఆఫర్‌ను ఎనేబుల్ చేయడానికి చెల్లింపు ఎంపికగా యూపీఐపై క్రెడిట్ లైన్‌ని జోడించడానికి వ్యాపారులు ఫోన్‌పే పీజీతో ఏకీకృతం కావాలని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ లైన్ అనేది బ్యాంక్ మీకు అవసరమైన మేరకు రుణం తీసుకోవడానికి అనుమతించే మొత్తం సొమ్ము. అలాగే ఈ సర్వీసు మీరు ఎంత సొమ్ము వాడుకుంటారో? అంత దానికే వడ్డీను చెల్లించాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెగాస్టార్ 'మన శంకరవరప్రసాద్ గారు'లో మెరిసిన ఈమె ఎవరో తెలుసా?
మెగాస్టార్ 'మన శంకరవరప్రసాద్ గారు'లో మెరిసిన ఈమె ఎవరో తెలుసా?
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్