Zomato Paytm Deal: జొమాటోతో జత కట్టిన పేటీఎం.. సరికొత్త యాప్ ద్వారా సేవలు

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పేటీఎంకు మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ. 2,048 కోట్లకు కొనుగోలు చేయనుంది. సమస్యాత్మకమైన ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీకి సంబంధించిన ప్రధాన కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు ఈ డీల్ సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Zomato Paytm Deal: జొమాటోతో జత కట్టిన పేటీఎం.. సరికొత్త యాప్ ద్వారా సేవలు
Zomato Paytm Deal
Follow us

|

Updated on: Aug 25, 2024 | 7:15 PM

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పేటీఎంకు మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ. 2,048 కోట్లకు కొనుగోలు చేయనుంది. సమస్యాత్మకమైన ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీకి సంబంధించిన ప్రధాన కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు ఈ డీల్ సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేటీఎం వినోదం టికెటింగ్ వ్యాపారం సినిమాలు, క్రీడలు, ఈవెంట్‌లను కవర్ చేస్తుంది. పేటీఎం తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి తీసుకున్న చర్య చెల్లింపులు, ఆర్థిక సేవలపై ఇకపై దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎం-జొమాటో డీల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇటీవలి త్రైమాసికాల్లో కంపెనీ తన ఆఫర్లను బీమా, ఈక్విటీ బ్రోకింగ్, సంపద పంపిణీలో విస్తరించింది. ఈ సేవలను క్రాస్-సేల్ చేయడానికి, ప్రముఖ ఆర్థిక సేవల పంపిణీ ప్లేయర్‌గా తన మార్కెట్ ఉనికిని పెంచుకోవడానికి గణనీయమైన అవకాశం ఉంది. వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్) పేటీఎం-జొమాటో డీల్‌ను ప్రకటించింది. ఇది రూ.2,048 కోట్ల విలువైన నగదు రహిత, రుణ రహిత ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం దాని 100 శాతం అనుబంధ సంస్థలైన ఓబ్గన్ టెక్నాలజీస్, వేస్ట్ ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లకు వ్యాపారాన్ని బదిలీ చేస్తుంది. ఆ తర్వాత ఈ అనుబంధ సంస్థలలో 100 శాతం వాటాను విక్రయిస్తుంది. తదనంతరం జొమాటో కొత్త వ్యాపారాన్ని ‘డిస్ట్రిక్ట్’ అనే కొత్త యాప్‌గా మారుస్తుంది.

ఈ డీల్ ప్రకారం జొమాటో సినిమా టిక్కెట్‌ల వ్యాపారంలో ఉన్న ఓబ్గన్ టెక్నాలజీస్‌ని పూర్తిగా రూ. 1,264.6 కోట్లకు కొనుగోలు చేస్తుంది. అలాగే ఈవెంట్‌ల టిక్కెట్టును రూ. 783.8 కోట్లకు వెస్ట్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం పేటీఎం తన ఆర్థిక సేవల వ్యాపారంపై దృష్టి పెట్టడంలో సహాయపడినప్పటికీ కొత్త సెగ్మెంట్‌ను జోడించడం ద్వారా జొమాటోల ఆదాయాన్ని పెంచుతుంది. ఇప్పటికే జొమాటో ద్వారా బ్లింక్ ఇట్ కొనుగోలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌కు భారీగా సహాయపడింది. దాని నికర లాభం జూన్ 2024 త్రైమాసికంలో రూ. 293 కోట్లకు పెరిగింది. పేటీఎంకు సంబంధించిన కంబైన్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం ఎఫ్‌వై24లో రూ. 297 కోట్ల ఆదాయాన్ని, సర్దుబాటు చేసిన ఈబీఐటీడీఏలో రూ. 29 కోట్లను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వ్యాపారాన్ని ‘డిస్ట్రిక్ట్’ అనే కొత్త యాప్‌గా మారుస్తుంది.ఈ తాజా చర్యలతో బీఎస్ఈలో వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు రూ. 11.10 లేదా 1.94 శాతం పెరిగి ఒక్కొక్కటి రూ. 584.2 వద్ద ట్రేడ్ అవుతుండగా జోమాటో షేర్లు బీఎస్‌ఈలో 0.01 శాతం తగ్గి రూ. 260 వద్ద ట్రేడయ్యాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రన్నింగ్‌ బైక్‌పై చిన్నారి డ్రైవర్‌ లేకుండానే ప్రయాణం.చూస్తే షాకే
రన్నింగ్‌ బైక్‌పై చిన్నారి డ్రైవర్‌ లేకుండానే ప్రయాణం.చూస్తే షాకే
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.! ఎమర్జెన్సీ లాండింగ్..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
స్పెషల్‌ సాంగ్‌లో శోభిత ధూళిపాళ.? సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌..
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.