AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion: ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.. 4 రోజుల్లో 2800 టన్నులు కొనుగోలు

ప్రభుత్వం బఫర్ స్టాక్ లక్ష్యాన్ని 3 లక్షల టన్నుల నుంచి 5 లక్షల టన్నులకు పెంచింది. ధరలు పెరుగుతాయనే భయంతో పంట నష్టపోతామనే భయంతో తొందరపడి, భయాందోళనలకు గురై అమ్మకాలు సాగించవద్దని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. ఎన్‌సీసీఎఫ్‌, ఎన్‌ఏఎఫ్‌ఈడీ రైతుల ఉల్లిపాయలను సరసమైన ధరలకు కొనుగోలు చేస్తాయి. అదే సమయంలో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60 వరకు ఉంది..

Onion: ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు..  4 రోజుల్లో 2800 టన్నులు కొనుగోలు
Onion Rate
Subhash Goud
|

Updated on: Aug 27, 2023 | 2:29 PM

Share

టమాటా తర్వాత ఉల్లి ధరలు సామాన్యులను కంటతడి పెట్టింస్తోంది. ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. సామాన్యుడికి ఇబ్బంది కలుగకుండా ధర నియంత్రణకు రంగంలో దిగుతోంది. అయినప్పటికీ, ధరలు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలను ప్రారంభించింది. ఇటీవల ఉల్లి ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం వాటిని బఫర్ నిల్వ చేయడం ప్రారంభించింది. గత 4 రోజుల్లో రైతుల నుంచి 2800 టన్నుల ఉల్లిని ఎన్‌సీసీఎఫ్‌ కొనుగోలు చేసింది. దీంతో ప్రభుత్వం బఫర్ స్టాక్ లక్ష్యాన్ని 3 లక్షల టన్నుల నుంచి 5 లక్షల టన్నులకు పెంచింది. ధరలు పెరుగుతాయనే భయంతో పంట నష్టపోతామనే భయంతో తొందరపడి, భయాందోళనలకు గురై అమ్మకాలు సాగించవద్దని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. ఎన్‌సీసీఎఫ్‌, ఎన్‌ఏఎఫ్‌ఈడీ రైతుల ఉల్లిపాయలను సరసమైన ధరలకు కొనుగోలు చేస్తాయి. అదే సమయంలో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60 వరకు ఉంది.

రెండు ప్రభుత్వ కమిటీలు NCCF, NAFED ఉల్లి ధరలను స్థిరంగా ఉంచడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆగస్టు 22 నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రైతుల నుంచి ప్రత్యక్ష కొనుగోళ్లను ప్రారంభించినట్లు తెలిపాయి. మహారాష్ట్రలో దాదాపు 12-13 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, డిమాండ్ పెరిగితే ఈ కేంద్రాలను మరింత పెంచుతామన్నారు. గత 4 రోజుల్లో ప్రభుత్వ కమిటీలు రైతుల నుంచి సరసమైన ధరలకు 2,826 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా కొనుగోళ్లు జరిగాయి. రైతులకు కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం ఉల్లిని క్వింటాల్‌కు రూ.2410 చొప్పున కొనుగోలు చేయగా ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1900-2000 పలుకుతోంది.

ఎగుమతి సుంకం

ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం వాటి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. కొత్త ఫీజు రేట్లు డిసెంబర్ 31 వరకు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశంలో ఉల్లి ధరలు 20 శాతం పెరగడం గమనార్హం. ఉల్లిపాయల ధరలు టమోటాల మాదిరిగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే ప్రభుత్వం ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉల్లి, టమోటా, కూరగాయల ధరలు కూడా ఆర్‌బీఐని ఆందోళనకు గురిచేశాయి.

ఇవి కూడా చదవండి

కాగా, ఒక వైపు నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోవడంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో సతమతమవుతున్నారు. టమాట ధరను నియంత్రించేందుకు కేంద్ర సర్కార్‌ ఎన్నో చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఉల్లి ధర కూడా పెరుగుతుండటంతో మరిన్ని చర్యలకు దిగుతోంది. ఎలాగైనా సరే ఉల్లి ధరను నియంత్రించాలని చర్యలు చేపడుతోంది.