Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Scooter: మరో 100 నగరాల్లో ఎలక్ట్రిక్‌ కిక్‌.. ఆ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించిన ఓలా

భారతీయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రియులు ఓలా వాహనాల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. మంచి బిల్డ్‌ క్వాలిటీతో వచ్చే ఓలా స్కూటర్ల కోసం ఎగబడుతున్నారు. ప్రజల నుంచి వచ్చి అనూహ్య డిమాండ్‌ దెబ్బకు ఓలా కూడా తన సేవలను వీలైనంత ఎక్కువగా విస్తరిస్తుంది. ఇటీవల ఓలా కంపెనీ రిలీజ్‌ చేసిన ఎస్‌ 1 ఎయిర్‌ స్కూటర్‌కు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటివరకు 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లతో ఎస్‌1 ఎయిర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ స్కూటర్‌లలో ఒకటిగా మారిందని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది.

Ola Scooter: మరో 100 నగరాల్లో ఎలక్ట్రిక్‌ కిక్‌.. ఆ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించిన ఓలా
Ola S1 Air
Follow us
Srinu

|

Updated on: Aug 27, 2023 | 12:45 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తుంది. పెరుగుతున్న పెట్రో ధరల దెబ్బకు సామాన్యులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా కాలుష్య నివారణకు ఈవీ వాహనాలకు అధిక సబ్సిడిలను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో ఈవీ వాహనాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. అనూహ్య డిమాండ్‌తో అన్ని కంపెనీలు కూడా ఈవీ వెర్షన్స్‌లో స్కూటర్లను లాంచ్‌ చేస్తున్నాయి. ఎన్ని కంపెనీలు ఎన్ని స్కూటర్లు లాంచ్‌ చేసిన భారతీయ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రియులు ఓలా వాహనాల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు. మంచి బిల్డ్‌ క్వాలిటీతో వచ్చే ఓలా స్కూటర్ల కోసం ఎగబడుతున్నారు. ప్రజల నుంచి వచ్చి అనూహ్య డిమాండ్‌ దెబ్బకు ఓలా కూడా తన సేవలను వీలైనంత ఎక్కువగా విస్తరిస్తుంది. ఇటీవల ఓలా కంపెనీ రిలీజ్‌ చేసిన ఎస్‌ 1 ఎయిర్‌ స్కూటర్‌కు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటివరకు 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లతో ఎస్‌1 ఎయిర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ స్కూటర్‌లలో ఒకటిగా మారిందని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ గత అక్టోబర్‌లో ప్రారంభించిన ఎస్‌1 ఎయిర్ డెలివరీలను  100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఇప్పటి వరకు 50,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం బుకింగ్‌లను కలిగి ఉంది. ఓలా ఎస్‌1 ఎయిర్‌ స్కూటర్ల డెలివరీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సాఫ్ట్‌బ్యాంక్ ఆధారిత స్టార్టప్ తన కస్టమర్ బేస్‌ను విస్తృతం చేయడానికి ఫిబ్రవరిలో ధరల పాయింట్స్‌లో మూడు ట్రిమ్స్‌తో ఎస్‌1 ఎయిర్‌ను అందించడం ప్రారంభించింది.  భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల విప్తవాన్ని తీసుకురావడం ఎస్‌1 ఎయిర్‌తో సాధ్యం అవుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్‌1 ఎయిర్ రాక త్వరలో భారతదేశ స్కూటర్ పరిశ్రమ ఐసీఈ యుగానికి ముగింపు పలకనుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మూడు రోజుల్లో అనూహ్య డిమాండ్‌

గత నెలలో 28 నుంచి 30వ తేదీ వరకూ ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ కొనుగోలు విండోను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ. 1,09,000గా ఉంది. మిగిలిన వినియోగదారులందరికీ రూ. 1,19,000 సవరించిన ధరతో కొనుగోలు విండో జూలై 31న తెరిచి బుకింగ్స్‌ అనుమతినిచ్చారు. అప్పటి నుంచి ఈ స్కూటర్‌కు అనూహ్య డిమాండ్‌ ఏర్పడింది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఎస్‌1 ఎయిర్‌లో 3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్, 58 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేసే 8.5 కేడబ్ల్యూ మోటారు అమర్చి ఉంది. ఇది ఒక ఛార్జీకి 151 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 90 కిలో మీటర్లుగా ఉంది. అలాగే ఈ స్కూటర్‌ ఆరు రంగులలో లభిస్తుంది. స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ వంటి ఆప్షన్స్‌లో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంటుంది. ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, 34-లీటర్ బూట్ స్పేస్, డ్యూయల్-టోన్ బాడీతో ఇది ఎస్ 1 ఎయిర్‌ ప్రియులను అమితంగా ఆకర్షిస్తుంది. 

ఇవి కూడా చదవండి

త్వరలో ఎస్‌ 1 ఎక్స్‌

ఓలా కంపెనీ ఇటీవల ఓలా ఎస్‌1 ఎక్స్‌ విడుదల చేసింది. ఇది ఎస్‌ 1 ఎయిర్ కంటే దిగువ స్థానంలో ఉంది. అలాగే కంపెనీ తక్కువ ధర మోడల్. ఎస్‌1 ఎక్స్‌ కోసం బుకింగ్‌లు ప్రారంభమైనప్పటికీ డెలివరీలు సంవత్సరం చివరిలో ప్రారంభమవుతాయి. ఆగస్ట్ 21 వరకు రూ.89,999 ప్రారంభ ధరతో బుక్ చేసుకోగలిగే 3 కేడబ్ల్యూ వేరియంట్ తర్వాత రూ.99,999కి విక్రయిస్తారు. అదేవిధంగా ఓలా ఎస్‌ ఎక్స్‌ 2 కేడబ్ల్యూ వేరియంట్ ధర రూ. 89,999గా ఉంది. ఈ నెలాఖరులోపు బుక్‌ చేసుకుంటే ఈ స్కూటర్‌ రూ. 79,999 అందుబాటులో ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..