Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Ticket Rules: వెయిటింగ్‌ లిస్ట్‌ కన్ఫామ్‌ అయినా బెర్త్‌ నెంబర్‌ అలాట్‌ కాలేదా? రైల్వే శాఖ చెబుతున్న కారణాలివే..!

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) 2002 నుంచి సమర్థవంతమైన ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించడం ద్వారా సాంప్రదాయ టిక్కెట్ కౌంటర్ అవాంతరాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అధికారిక వెబ్‌సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా ప్రయాణీకులు సులభంగా టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సదుపాయం వల్ల రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద రద్దీ అనూహ్యంగా తగ్గింది. ‍ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ ఫోన్స్‌ నుంచే టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారు.

Train Ticket Rules: వెయిటింగ్‌ లిస్ట్‌ కన్ఫామ్‌ అయినా బెర్త్‌ నెంబర్‌ అలాట్‌ కాలేదా? రైల్వే శాఖ చెబుతున్న కారణాలివే..!
IRCTC
Follow us
Srinu

|

Updated on: Aug 27, 2023 | 1:15 PM

భారతదేశంలో ఎక్కువ మంది దూర ప్రాంతాలకు ప్రయాణించాలనుకుంటే ముందుగా రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తారు. ముందుగానే టూర్‌ ప్లాన్‌ చేసుకుని అందుకు అనుగుణంగా టికెట్‌లను చాలా మంది బుక్‌ చేసుకుంటూ ఉంటారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) 2002 నుంచి సమర్థవంతమైన ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించడం ద్వారా సాంప్రదాయ టిక్కెట్ కౌంటర్ అవాంతరాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. అధికారిక వెబ్‌సైట్లో లాగిన్ అవ్వడం ద్వారా ప్రయాణీకులు సులభంగా టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సదుపాయం వల్ల రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద రద్దీ అనూహ్యంగా తగ్గింది. ‍ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ ఫోన్స్‌ నుంచే టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు కన్ఫామ్‌ అయినట్లు మెసేజ్‌ వస్తుందే కానీ.. బోగీ, బెర్త్‌కు సంబంధించి వివరాలు రావడం లేదు. రైలు బయలుదేరే ముందు సమయం వరకూ ఈ వివరాలు అందుబాటులో ఉండడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ విషయంపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. వివిధ బుకింగ్‌ ఎలాట్‌మెంట్‌ల కారణంగానే బెర్త్‌ కన్ఫామ్‌ అవ్వడానికి సమయం పడుతుందని తెలుస్తుంది. రైల్వే వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రైల్వే నివేదికల ప్రకారం ఎవరైనా ధ్రువీకరించిన టిక్కెట్‌ను రద్దు చేసినప్పుడు వెయిటింగ్ లిస్ట్‌లోని వారు ప్రయోజనం పొందుతారు. రద్దు కారణంగా ఏర్పడే ఖాళీ స్థలం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మొదటి వ్యక్తికి తక్షణమే కేటాయిస్తారు. ఈ తరహా టికెట్లు త్వరిత నిర్ధారణ అవుతాయి. వెంటనే ప్రయాణికుడి మొబైల్‌ నెంబర్‌కు కన్ఫామ్‌ అయిన టికెట్‌కు సంబంధించిన వివరాలు మెసేజ్‌ రూపంలో వస్తాయి. సాధారణంగా రైలు నిర్ణీత నిష్క్రమణకు నాలుగు గంటల ముందు రైలు చార్ట్‌లు తయారు చేస్తారు. చార్ట్ తయారీకి ముందు ప్రయాణీకులు తమ టిక్కెట్‌లను రద్దు చేసుకోవడం సర్వసాధారణం. కాబట్టి ఈ టికెట్లు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉన్న వారికి కన్ఫామ్‌ అవుతాయి. అలాగే వీటికి అదనంగా ప్రతి కోచ్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ నియమించిన అత్యవసర కోటాను కలిగి ఉంటుంది. ఎమర్జెన్సీ కోటా కింద రిజర్వ్ చేసిన సీట్లు లేదా బెర్త్‌లు వినియోగించకపోతే అవి ఖాళీగా ఉంటాయి. కేటాయింపు ప్రక్రియలో భాగంగా రైల్వే వ్యవస్థ ఈ ఖాళీ సీట్లు లేదా బెర్త్‌లను చార్ట్ తయారీకి ముందు కేటాయిస్తుంది. 

ఈ కేటాయింపులో రిజర్వేషన్ సమయంలో వారి సీటు ప్రాధాన్యతలను పేర్కొన్న వెయిట్‌లిస్ట్ టిక్కెట్‌లను కలిగి ఉన్న ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ వ్యవస్థ సీనియర్ సిటిజన్లు, మహిళా ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తుంది. అలాగే ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (పీఎన్‌ఆర్‌) ఆరు రిజర్వేషన్‌లను కలిగి ఉంటే మూడు టికెట్లు కన్ఫామ్‌ అయ్యి మరో మూడు వెయిట్‌లిస్ట్‌లో ఉన్న సమయంలో అలాంటి ప్రయాణికులకు వారి సౌలభ్యం కోసం సీట్లు లేదా బెర్త్‌లను కేటాయిస్తారు. ప్రయాణికులందరికీ సీట్ల కేటాయింపును ఆప్టిమైజ్ చేయడానికి సిస్టమ్ చేసిన ప్రయత్నం ఫలితంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు బెర్త్‌ నెంబర్‌ లేని కన్ఫామ్‌ మెసేజ్‌లు వస్తాయి. అనంతరం చార్ట్‌ ప్రిపరేషన్‌ టైమ్‌ బెర్త్‌ కన్ఫామ్‌ అయినట్లు మెసేజ్‌ వస్తుంది. అలా రాని పక్షంలో ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ ద్వారా బెర్త్‌, బోగీ నెంబర్‌ తెలుసుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

రేపే సంకటహర చతుర్థి.. పూజ విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి..
రేపే సంకటహర చతుర్థి.. పూజ విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి..
వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. పూర్తి వివరాలు..
వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. పూర్తి వివరాలు..
కేవలం 1429 రూపాయలకే విమాన ప్రయాణం..! అదిరిపోయే అవకాశం.. త్వరపడండి
కేవలం 1429 రూపాయలకే విమాన ప్రయాణం..! అదిరిపోయే అవకాశం.. త్వరపడండి
మాడు పగిలే ఎండల్లో మంచి వార్త.. ఏపీలో వచ్చే 3 రోజులు జోరున..
మాడు పగిలే ఎండల్లో మంచి వార్త.. ఏపీలో వచ్చే 3 రోజులు జోరున..
స్టార్‌'' లయన్‌ స్కార్‌ఫేస్‌కు కోట్లలో అభిమానులు .. ఎందుకంటే!
స్టార్‌'' లయన్‌ స్కార్‌ఫేస్‌కు కోట్లలో అభిమానులు .. ఎందుకంటే!
మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
తెలివైనోళ్లు తోకముడిచారు.. ఈ ఫోటోలో పామును మీరు కనిపెట్టగలరా.?
తెలివైనోళ్లు తోకముడిచారు.. ఈ ఫోటోలో పామును మీరు కనిపెట్టగలరా.?
ఎరుపు లేదా నలుపు.. వేసవిలో ఎలాంటి కుండ వాడితే మంచిదో తెలుసా..?
ఎరుపు లేదా నలుపు.. వేసవిలో ఎలాంటి కుండ వాడితే మంచిదో తెలుసా..?
గ్రామీణ సాధికారత, ఆరోగ్య బారత్‌గా మార్చడమే లక్ష్యం!
గ్రామీణ సాధికారత, ఆరోగ్య బారత్‌గా మార్చడమే లక్ష్యం!
సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి స్టన్నింగ్ ఫోటోలు..
సలార్ బ్యూటీ శ్రియ రెడ్డి స్టన్నింగ్ ఫోటోలు..