రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్..

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి మాత్రమే రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. స్టేషన్లలో నేరుగా టికెట్లను విక్రయించే పద్ధతిని ప్రారంభించలేదు.

రైలు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: May 14, 2020 | 7:56 AM

క‌రోనాతో పోరాటం చేస్తూనే..నిత్య‌జీవ‌నం సాగించాల‌నే ఏకాభిప్రాయానికి వ‌చ్చేసింది యావ‌త్ ప్ర‌పంచం. భార‌త్‌లోనూ లాక్‌డౌన్‌ను ద‌శ‌ల వారిగా ఎత్తివేసే చ‌ర్య‌ల‌కు ప్ర‌య‌త్నాలు చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలోనే లాక్‌డౌన్ సమయంలో నడుపుతున్న స్పెషల్ ట్రైన్ల విషయంలో నిబంధనలను సడలించింది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఎలాంటి వెయిటింగ్ లిస్ట్ సౌకర్యం లేదు. కేవలం కన్ ఫాం టికెట్ ఉన్న వారు మాత్రమే రైల్వే స్టేషన్‌లో అడుగు పెట్టవచ్చు. కానీ, ఇప్పుడు వెయిటింగ్ లిస్టులు కూడా అందుబాలోకి తెచ్చేందుకు రైల్వే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.
మే 22 నుంచి ప్రారంభమయ్యే ప్రయాణాలకు వెయిటింగ్ జాబితాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారత రైల్వే మే 13న‌ ప్రకటించింది. మే 15 నుంచి బుక్ చేసుకున్న టికెట్ల కోసం ఈ సౌలభ్యం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అయితే ఈ సంఖ్య పరిమితంగానే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేర‌కు ప్రత్యేక రైళ్ల కోసం వెయిటింగ్ లిస్ట్ ఏసి 3 టైర్‌కు 100, ఏసి 2 టైర్‌కు 50, స్లీపర్ క్లాస్‌కు 200, చెయిర్ కార్‌కు 100 చొప్పున, మొదటి ఏసి, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు 20 చొప్పున మాత్రమే వెయిటింగ్ లిస్ట్ ఉండనుంది. అంతకుమించి బుకింగ్ యాక్సెప్ట్ కాదని రైల్వే శాఖ తెలిపింది. ప్రత్యేక రైళ్లలో ఆర్‌ఏసీ ఉండదని భారత రైల్వే ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేర‌కు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి మాత్రమే రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. స్టేషన్లలో నేరుగా టికెట్లను విక్రయించే పద్ధతిని ప్రారంభించలేదు. ఇక క‌రోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రయాణికులు పలు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే