E Challans: ఇదేందిరా నాయనా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. రూ.470 కోట్ల జరిమానా!
E Challans: వాహనం నిబంధనలను ఉల్లంఘించినప్పుడల్లా దాని చిత్రం, వీడియో ఆధారంగా నివేదిక తయారు చేస్తారు. ఈ నివేదికను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఆపరేటర్ తనిఖీ చేసి ఆపై RTO అధికారి చలాన్‌ను ఆమోదిస్తారు. నివేదిక ప్రకారం.. 10 కి.మీ పొడవైన..

E Challans: ప్రతి రోజు ఎంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. అలాంటి వారిపై కన్నేసి ఉంచుతున్న ట్రాఫిక్ పోలీసులు.. గట్టి షాకిస్తున్నారు. వారిపై జరిమానా విధిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని పదేపదే చెబుతున్నప్పటికీ వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులకు భారీ పెనాల్టీలను విధిస్తున్నారు.
మహారాష్ట్ర రవాణా శాఖ డేటా ప్రకారం, జూలై 2024 నుండి జూలై 2025 వరకు అంటే ఏడాదిలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 27.76 లక్షల ఇ-చలాన్లు జారీ చేశారు. ఈ చలాన్ల మొత్తం దాదాపు రూ. 470 కోట్లు. కానీ ఇప్పటివరకు రూ. 51 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి.
ఇది కూడా చదవండి: Today Gold Price: మహిళలకు పండగలాంటి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు
అతివేగానికి సంబంధించిన చాలా కేసులు:
ఈ 95 కి.మీ. పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేలో కారు డ్రైవర్లపై గరిష్ట సంఖ్యలో చలాన్లు జారీ చేశారు అధికారులు. కార్లకు 17.20 లక్షలకు పైగా ఈ-చలాన్లు జారీ అయ్యాయి. దీని తరువాత భారీ గూడ్స్ వాహనాలకు 3.27 లక్షలు, బస్సుల వంటి భారీ ప్రయాణికుల వాహనాలకు 2.48 లక్షలు, టాక్సీలకు .2 లక్షలు, తేలికపాటి గూడ్స్ వాహనాలకు 1.2 లక్షలు జారీ చేశారు. దీనితో పాటు మీడియం గూడ్స్ వాహనాలకు 85,468 ఈ-చలాన్లు, ఆర్టిక్యులేటెడ్ హెవీ గూడ్స్ వాహనాలకు 30,450, మీడియం ప్యాసింజర్ బస్సులకు 14,764 ఈ-చలాన్లు జారీ అయ్యాయి.
రోడ్డు భద్రతను పెంచడానికి, ప్రమాదాలను తగ్గించడానికి జూలై 2024లో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) ప్రారంభించింది. ఇందులో రూల్ బ్రేకర్లను గుర్తించే హై-రిజల్యూషన్ కెమెరాలు, AI-ఆధారిత డిటెక్షన్ టూల్స్ ఉన్నాయి. దీని కింద మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) ఎక్స్‌ప్రెస్‌వేపై 40 గ్యాంట్రీలు, వందలాది CCTV కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అందులో రూ.45 కోట్లు రోడ్డు భద్రతా నిధి నుండి అందించారు.
చలాన్ ఎలా ప్రాసెస్ అవుతాయి?
ITMS ద్వారా వాహనం నిబంధనలను ఉల్లంఘించినప్పుడల్లా దాని చిత్రం, వీడియో ఆధారంగా నివేదిక తయారు చేస్తారు. ఈ నివేదికను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఆపరేటర్ తనిఖీ చేసి ఆపై RTO అధికారి చలాన్‌ను ఆమోదిస్తారు. నివేదిక ప్రకారం.. 10 కి.మీ పొడవైన ఖండాలా ఘాట్ విభాగంలో అతివేగంగా నడపడానికి గరిష్ట చలాన్లు విధించారు. ప్రస్తుత పరిమితి చాలా తక్కువగా ఉన్నందున, మరిన్ని చలాన్లు విధిస్తున్నందున ఈ భాగంలో వేగ పరిమితిని పెంచాలని రవాణాదారులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఇదేం పోయే కాలం.. ఇలాంటి వాళ్లను ఏమనాలి బ్రో.. రీల్ కోసం చీరకే నిప్పటించుకుంది
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








