AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.20 లక్షలు అయింది.. అదీ సంవత్సరంలోనే..

పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం. తక్కువ లిక్విడిటీ కారణంగా అస్థిరత ఎక్కువగా ఉంటుంది. అయితే..

Multibagger Stock: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.20 లక్షలు అయింది.. అదీ సంవత్సరంలోనే..
Bulk Deal
Srinivas Chekkilla
|

Updated on: Dec 16, 2021 | 2:26 PM

Share

పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం. తక్కువ లిక్విడిటీ కారణంగా అస్థిరత ఎక్కువగా ఉంటుంది. అయితే దాని ఫండమెంటల్స్ బలంగా ఉంటే.. అది దాని వాటాదారులకు మంచి రాబడిని ఇస్తుంది. కాస్మో ఫెర్రైట్స్ షేర్లు దీనికి మంచి ఉదాహరణ. 2021లో మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లలో ఇది ఒకటి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఈ ఏడాది రూ. 12 నుంచి రూ. 240కి ఎగబాకి, దాని వాటాదారులకు 2,000 శాతం రాబడిని అందిస్తోంది.

ఈ సంవత్సరం చాలా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్‌లు పెట్టుబడిదారులకు భారీ రాబడిని ఇచ్చాయి. మార్కెట్‌లో రికార్డు స్థాయి బూమ్‌లో ఇన్వెస్టర్లు మంచి లాభాలను ఆర్జించారు. గత ఒక నెలలో, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ. 225.70 నుండి రూ. 240 స్థాయికి పెరిగింది. దాదాపు 6 శాతం రాబడిని ఇచ్చింది. గత 6 నెలల్లో పెన్నీ స్టాక్ ధర రూ.28.30 నుంచి రూ.240కి పెరిగింది. ఈ కాలంలో 750 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 సంవత్సరంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 20 రెట్లు పెరిగింది. దీని విలువ రూ.12 నుంచి రూ.240కి పెరిగింది.

2021లో ఆల్ఫా స్టాక్‌లలో మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ కూడా ఒకటి. ఈ ఏడాది స్టాక్‌ తన వాటాదారులకు 2000 శాతం రాబడిని అందించింది. ఈ కాలంలో, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ దాదాపు 23 శాతం ఇవ్వగా, బిఎస్‌ఇ సెన్సెక్స్ 21 శాతం రాబడిని ఇచ్చింది. అందువల్ల, ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్‌తో పోలిస్తే 2021లో పెన్నీ స్టాక్‌లు చాలా ఎక్కువ రాబడిని ఇచ్చాయి. ఒక ఇన్వెస్టర్ ఒక నెల క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. దాని విలువ ఇప్పుడు రూ. 1.06 లక్షలుగా మారింది. ఒక ఇన్వెస్టర్ 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో 1 లక్ష పెట్టుబడి పెడితే ఈ రోజు 8.50 లక్షలు అయింది. ఒక ఇన్వెస్టర్ 2021 ప్రారంభంలో ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే ప్రస్తుతం దాని విలు 20 లక్షలుగా ఉంది.

సాఫ్ట్ ఫెర్రైట్ కోర్ ఉత్పత్తి, అధిక నాణ్యత ప్రమాణాలలో మూడు దశాబ్దాల నైపుణ్యంతో, కాస్మో ఫెర్రైట్స్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా, ఓషియానియాలో విస్తృత పంపిణీ నెట్‌వర్క్‎తో ఉంది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read Also.. Petrol Diesel Price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...