Moto G35: మరో నయా స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన మోటో.. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..!
భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ భారీగా పెరిగింది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లకు అధిక డిమాండ్ ఏర్పడడంతో అన్ని కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇటీవల ప్రముఖ కంపెనీ మోటోరోలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ జీ 35ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మోటోరోలా భారతదేశంలో తన కొత్త మోటో జీ 35 స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. మోటోరోలా కంపెనీ ఎంట్రీ-లెవల్ ఆఫర్ కింద కేవలం రూ. 10,000 లోపు ఈ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. 4కే వీడియో రికార్డింగ్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డ్యూయల్ స్పీకర్‌లు, అట్మాస్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మోటోరోలా జీ 35 ఫోన్‌ను కేవలం రూ. 9,999కే అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లతో పాటు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ డిసెంబర్ 16 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
మోటోరోలా జీ 35 6.7 అంగుళాల 120 హెచ్‌జెడ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో రిలీజ్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఐపీ52 రేటింగ్‌తో స్ప్లాష్ నిరోధకతతో అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరలోనే ఐపీ రేటింగ్‌ను అందించే అత్యంత సరసమైన ఫోన్‌లలో ఒకటిగా మోటో జీ 35 నిలిచింది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ యునిసాక్ టీ 760 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
మోటోరోలా జీ 35 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. కెమెరా సెటప్ నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్‌తో పాటు 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ పొందే అవకాశం ఉంది. అలాగే మోటో జీ 35 ఫోన్ 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుంది. అలాగే ఈ ఫోన్ 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌నిచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి