Gold Rate: బాబోయ్.. బంగారం ఒక్కసారే ఇంతలా పెరిగిందేంటి..?
- పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే, పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. పసిడి ధరలు నిన్నటితో పోల్చితే భారీగా పెరిగాయి.
బంగారం ఇంకా దిగిరావడం లేదు. ధరల్లో మార్పులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ట్రంప్ గెలుపుతో డౌన్‌ట్రెండ్‌లోకి వచ్చిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు మళ్లీ మెల్లగా పెరుగూ వెళ్తున్నాయ్. హైదరాబాద్ మార్కెట్ సహా అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగానే పెరిగాయి. . ఒకానొక టైమ్‌లో పది గ్రాముల బంగారంపై ఐదారు వేల రూపాయల వరకు తగ్గింది. సుమారు రెండు వారాలపాటు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు మళ్లీ జెట్ స్పీడ్‌తో పైకి దూసుకెళ్తోంది. ఇది అసలే, వెడ్డింగ్ సీజన్ కావడంతో.. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
హైదరాబాద్:
- 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.750 మేర పెరిగి రూ.72,050 వద్దకు చేరింది.
- 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.820 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 78 వేల 600 స్థాయికి ఎగబాకింది.
విజయవాడ:
- 22 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాముల ధర రూ.72,050 వద్దకు చేరుకుంది.
- 24 క్యారెట్ల బంగారం ధర 78,600కే చేరింది.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో రేట్లు ఇంచుమించు ఇలానే ఉన్నాయి. పూరెగుడిసెలో బీదబీక్కికయినా….కోటలో ఉండే మహారాజుకయినా..బంగారం అవసరం. కొన్ని సందర్భాల్లో అయితే అత్యవసరం. అందుకే ఇప్పుడది ప్రతి ఒక్కవరికీ నిత్యావసరమైంది. బులియన్ మార్కెట్‌లో దాని దూకుడు చూస్తే మైండ్ బ్లోయింగ్. త్వరలోనే లక్షదాటినా ఆశ్చర్యం లేదు. అందుకే గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ సూపర్బ్ అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
కాగా వెండి రేటు కూడా ఒక్కసారిగా పైకి ఎగబాగింది. ఒక్కరోజే వెండి కిలో రూ.4000 పెరిగి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది. మరికాసేపటికి ధరల్లో హెచ్చుతగ్గలు ఉండే చాన్స్ ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి