AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motovolt Urban E-Bike: లైసెన్స్ అవసరమే లేని ఈ-బైక్ ఇది.. ధర కేవలం రూ. 50వేల లోపే.. సిటీ అవసరాలకు బెస్ట్..

అనువైన బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఇదే అంశంపై ఫోకస్ పెట్టిన ఓ కంపెనీ అత్యంత అనువైన ధరలో మంచి శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. అంతేకాక దీనిని రైడ్ చేయడానికి లైసెన్స్ కూడా అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పేరు మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 120కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

Motovolt Urban E-Bike: లైసెన్స్ అవసరమే లేని ఈ-బైక్ ఇది.. ధర కేవలం రూ. 50వేల లోపే.. సిటీ అవసరాలకు బెస్ట్..
Motovolt Urban E Bike
Madhu
|

Updated on: Feb 07, 2024 | 6:53 AM

Share

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా డిమాండ్ ఉంది. అది ఇంకా పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో వాటి వృద్ధి సాధ్యం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం వాటి ధరలు. అవును ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు రూ. లక్ష పైనే ఉంటున్నాయి. ఈ క్రమంలో అనువైన బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సరిగ్గా ఇదే అంశంపై ఫోకస్ పెట్టిన ఓ కంపెనీ అత్యంత అనువైన ధరలో మంచి శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. అంతేకాక దీనిని రైడ్ చేయడానికి లైసెన్స్ కూడా అవసరం లేదని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ పేరు మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్. ఇది సింగిల్ చార్జ్ పై ఏకంగా 120కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది చూడటానికి చాలా స్టైలిస్ గా ఉంటుంది. అలాగే రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ ధర, లభ్యత..

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ రూ. 49,999 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేవలం రెండు వేరియంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌పై 5 రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇది పెద్ద టైర్ సైజులు, సౌకర్యవంతమైన సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇది కొత్తగా వచ్చిన కొత్త తరం బైక్.

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ బ్యాటరీ..

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్‌లో భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. అది కేవలం 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది రహదారిపై 25 ఎంపీహెచ్ వేగంతో నడుస్తుంది. దీని బీఎల్డీసీ మోటార్ అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది రైడ్‌ను సున్నితంగా చేస్తుంది. ఈ ఈ-బైక్‌లో 36 V/20 Ah బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది

ఇవి కూడా చదవండి

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ కనెక్టివిటీ..

ఈ-బైక్ మొత్తం బరువు కేవలం 40 కిలోలు. ఇది రోడ్డుపై నియంత్రణ, రైడ్ చేయడం సులభం చేస్తుంది. మోటోవోల్ట్ అర్బన్‌లో ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ తో వస్తుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున డ్యూయల్ షాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.

మోటోవోల్ట్ అర్బన్ ఈ-బైక్ చక్రాలు..

దీని రెండు టైర్లలో డిస్క్ బ్రేకులు అందిచారు. ఇది పెద్ద 20-అంగుళాల చక్రాలను కలిగి ఉంది. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మోటోవోల్ట్ బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 అర్బన్ మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ తో పోటీపడుతుంది.

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు..

మోటోవోల్ట్ అర్బన్ ఇ-బైక్‌ను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అదనంగా, దానిని నమోదు చేయవలసిన అవసరం కూడా లేదు. వాస్తవానికి, నిబంధనల ప్రకారం, భారతదేశంలో 16-18 ఏళ్ల వయస్సు గల వారు మాత్రమే గేర్‌లెస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నడపగలరు. అటువంటి వాహనాల గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. ఇది కూడా అంతే వేగంతో ప్రయాణించగలుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..