LinkedIn: చైనాలో నిలిచిపోయిన లింక్డ్‌ఇన్ సర్వీసు.. కారణం అదేనా?..
చైనాలో గురువారం నుంచి కెరీర్ ఆధారిత సోషల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్‌ను నిలిపివేసినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. టెక్ కంపెనీలపై నియంత్రణకు చైనా కఠిన ఆంక్షాలు విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది...
చైనాలో గురువారం నుంచి కెరీర్ ఆధారిత సోషల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్‌ను నిలిపివేసినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. టెక్ కంపెనీలపై నియంత్రణకు చైనా కఠిన ఆంక్షాలు విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అక్కడ పనిచేయడం సవాలుగా మారిందని చెప్పింది. ప్రత్యేకంగా ఉద్యోగుల కోసమే రూపొందించిన లింక్డ్‌ఇన్ సేవల్ని నిలిపివేయడం వల్ల ఆ వర్గం ఇబ్బందులు ఎదుర్కోనున్న నేపథ్యంలో మరో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేలా ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నట్లు పేర్కొంది. అయితే, అందులో నెట్‌వర్కింగ్ ఫీచర్లు మాత్రం ఉండబోవని సంస్థ ఇంజినీరింగ్ విభాగం ఉపాధ్యక్షుడు మొహక్ ష్రాఫ్ స్పష్టం చేశారు. “మేము చైనాలో ఆపరేటింగ్ చేయడం సవాల్‌గా ఉంది. ఎక్కువ ఇబ్బుందులు ఎదుర్కొంటున్నాం” అని ష్రాఫ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, లింక్డ్‌ఇన్ సైట్‌లోని కంటెంట్‌ని పర్యవేక్షించడానికి చైనీస్ ఇంటర్నెట్ రెగ్యులేటర్లకు గడువు విధించారు. 2014 లో చైనాలో ప్రారంభించిన లింక్డ్ఇన్, ఉద్యోగ అవకాశాలను కనుగొనడానికి వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడింది. చైనా అధికారులు టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షాలు విధిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ లింక్డ్‌ఇన్‌ను 2016 లో 26 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ చైనాలో ఉనికిని చాటుకోవడానికి కృషి చేసింది. దశాబ్దానికి పైగా చైనాలో ఫేస్‌బుక్, ట్విట్టర్ నిషేధించబడ్డాయి. హ్యాకింగ్ దాడి, సెన్సార్‌షిప్‌కు ప్రతిస్పందనగా గూగుల్ 2010 లో దేశం విడిచి వెళ్లింది. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యొక్క వెబ్‌సైట్ చైనాలో అందుబాటులో ఉంది. కానీ అక్కడి మార్కెట్‌లో అలీబాబా, జెడి.కామ్ వంటి స్థానిక కంపెనీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
Read Also.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే.. ఆ రెండు షేర్లతో 4 రోజుల్లో రూ.1,331 కోట్ల ఆదాయం