రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే.. ఆ రెండు షేర్లతో 4 రోజుల్లో రూ.1,331 కోట్ల ఆదాయం

Rakesh Jhunjhunwala: ప్రముఖ షేర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు దసరా నవరాత్రులు కోట్ల వర్షం కురిపించాయి. పట్టిందల్లా బంగారమా.. అన్నట్లు ఆయన సంపద గత వారం రోజుల్లోనే భారీగా పెరిగింది.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే.. ఆ రెండు షేర్లతో 4 రోజుల్లో రూ.1,331 కోట్ల ఆదాయం
Rakesh Jhunjhunwala
Follow us

|

Updated on: Oct 15, 2021 | 3:15 PM

Rakesh Jhunjhunwala: ప్రముఖ షేర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు దసరా నవరాత్రులు కోట్ల వర్షం కురిపించాయి. పట్టిందల్లా బంగారమా.. అన్నట్లు ఆయన సంపద గత వారం రోజుల్లోనే భారీగా పెరిగింది. మొన్న ఈ మధ్య ఆయన్ను ప్రధాని నరేంద్ర మోడీ కలుసుకున్నారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భాగస్వామ్యంలోని ఆకాశ ఎయిర్ సంస్థ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిగ్ బుల్ జోరు అంతటితో ఆగలేదు. ఆయన అత్యంత విలువైన లిస్టెడ్ హోల్డింగ్స్‌లో టాటా గ్రూపు షేర్లు కూడా ఉన్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన రెండు షేర్లు భారీ లాభాలు ఆర్జించడంతో ఆయన సంపద ఈ వారంలోనే ఏకంగా రూ.1,331 కోట్లు పెరిగిందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. టాటా గ్రూప్‌కి చెందిన టైటన్, టాటా మోటార్స్ షేర్లు ఆయనకు నాలుగు ట్రేడింగ్ సెషన్లలో భారీ లాభాలు ఆర్జించిపెట్టాయి. మునుపటి వారంతో పోల్చితే.. ఈ వారం టాటా మోటార్స్ షేర్ విలువ 30 శాతం మేర లాభపడగా.. టైటన్ 8.98 శాతం మేర లాభపడినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గత వారాంతంలో ఆయన దగ్గర టాటా మోటార్స్‌కు చెందిన 3.77 కోట్ల ఈక్విటీ షేర్లు ఉన్నాయి. దీని విలువ రూ.1,445 కోట్లుగా ఉండగా.. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో దీని విలువ రూ.1,874 కోట్లకు చేరింది. దీంతో ఈ ఒక్క షేర్‌తోనే ఆయన సంపద రూ.429.59 కోట్లు పెరిగింది. అలాగే టైటన్‌ కంపెనీ లిమిటెడ్‌లో ఆయనకు, ఆయన భార్యకు 4.26 కోట్ల ఈక్విటీ షేర్లు ఉన్నాయి. టైటన్‌లో 4.81 శాతం వాటాలు కలిగిన వారి షేర్ల విలువ గత వారాంతంలో రూ.10,046 కోట్లుగా ఉంది. అయితే గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఇది 8.98 శాతం లాభపడటంతో దీని విలువ రూ.10,948 కోట్లకు చేరింది. దీంతో ఈ షేర్ ద్వారా ఆయన ఆదాయం రూ.902 కోట్లు పెరిగింది.

స్టాక్ మార్కెట్‌లు రికార్డు గరిష్ఠ స్థాయికి చేరడంతో ఆయన లిస్టెడ్ హోల్డింగ్స్‌లోని ఇతర షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, కాన్‌కార్డ్ బయోటెక్ తదితర ప్రైవేటు కంపెనీల్లో కూడా ఝున్‌ఝున్‌వాలాకు భారీగా వాటాలు ఉన్నాయి.ఈ ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ వారంలో ఆయన ధనార్జన మరిన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది.

1986లో ఝున్‌ఝున్‌వాలా ఒక కంపెనీకి సంబంధించిన 5 వేల షేర్లు కొనుగోలు చేశారు. ఆయన వాటిని ఒక్కో షేర్ రూ.43 చొప్పున కొనగా.. కేవలం మూడు నెలల్లోనే ఆ షేర్ ధర ఒక్కక్కటి రూ.143 రూపాయలకు పెరిగింది. షేర్ మార్కెట్‌లో ఆయన విజయాలలో అది మొదటిదిగా చెబుతున్నారు. ఈ వారం వచ్చిన ఆదాయాన్ని కలుపుకుని ఆయన సంపద దాదాపు రూ. 50 వేల కోట్లుగా ఉండొచ్చని అంచనావేస్తున్నారు. ఝున్‌ఝున్‌వాలా తన సంస్థ ‘రేర్ ఎంటర్‌ప్రైజెస్’ ద్వారా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారు. ఆయన తన పేరు, తన భార్య రేఖ పేర్లలోని మొదటి రెండు అక్షరాలు కలిపి దానికి రేర్ అనే పేరు పెట్టారు.

Also Read..

Bigg Boss 5 Telugu: బెస్ట్ ఎవరో.. వరస్ట్ ఎవరో.. సిరి ఆటీట్యూడ్ నచ్చలేదంటున్న యానీ మాస్టర్..

Car Accident: ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు బోల్తా… కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో తప్పిన ప్రమాదం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు