Xiaomi EV Car: త్వరలో మార్కెట్‌ను పలుకరించనున్న ఎంఐ ఈవీ.. లీకైన బ్యాటరీ ఫొటో.. సామర్థ్యం ఎంతో తెలుసా?
ఫోర్ వీలర్స్ ప్రజలకు అంతలా ఆకట్టుకోలేదు. ఎందుకంటే కార్లపై ఎక్కువ దూరం ప్రయాణిస్తాం కాబట్టి చార్జింగ్ ఇబ్బంది అవుతుందని ప్రజలు ఈవీ వాహనాలపై మొగ్గు చూపడం లేదు. దీంతో ఇటీవల కాలంలో కార్లలకు అధిక మైలేజ్‌ను అందించేలా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా టాప్ కంపెనీలే కాకుండా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఎంఐ కొత్త ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేస్తుందనే వార్తలు ఆటోమొబైల్ రంగంలో హల్‌చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా పెట్రో వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి అన్ని దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. అలాగే ఈవీ వాహనాలపై సబ్సిడీలను అందిస్తూ ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. అయితే ఈవీ వాహనాల్లో ఎక్కువగా టూ వీలర్స్‌ను ప్రజలు ఎక్కువ ఆదరించారు. కానీ ఫోర్ వీలర్స్ ప్రజలకు అంతలా ఆకట్టుకోలేదు. ఎందుకంటే కార్లపై ఎక్కువ దూరం ప్రయాణిస్తాం కాబట్టి చార్జింగ్ ఇబ్బంది అవుతుందని ప్రజలు ఈవీ వాహనాలపై మొగ్గు చూపడం లేదు. దీంతో ఇటీవల కాలంలో కార్లలకు అధిక మైలేజ్‌ను అందించేలా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా టాప్ కంపెనీలే కాకుండా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఎంఐ కొత్త ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేస్తుందనే వార్తలు ఆటోమొబైల్ రంగంలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజయం చేస్తూ ఎంఐ కారుకు సంబంధించిన బ్యాటరీ ఫొటో చైనాలో లీకయ్యింది. కాబట్టి ఆ విశేషాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎంఐ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ తయారీదారుల్లో ఒకటి ఈ కంపెనీ ఎంఎస్ 11 పేరుతో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తోంది . ఈ వార్తలను నిజం చేస్తూ ఎంఐ బ్రాండెడ్ బ్యాటరీ ఫొటో లీక్యింది. ఈ బ్యాటరీ తీక్షణంగా పరిశీలిస్తే గరిష్ట వోల్టేజ్ 726.7 వోల్ట్‌లు, 139 ఏహెచ్ సామర్థ్యంతో 101 కేడబ్ల్యూహెచ్‌తో వస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ కారు చిత్రాలు అంతకుముందు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఎంఎస్11 ఎలక్ట్రిక్ సెడాన్ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనవా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ కారును ఓ సారి ఛార్జ్ చేస్తే 1,000 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేలా డిజైన్ చేశారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఎంఐ కంపెనీకు తక్కువ ధరలకే ప్రొడెక్టులను అందిస్తుందనే పేరు ఉంది. ఒకవేళ ఈ విధానాన్ని ఈవీ కార్ల విషయంలో కూడా పాటిస్తే ఈవీ రంగంలో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఆరు స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్లను కలిగి ఉన్న ఎంఐ కంపెనీ కొత్త ఈవీ ఓఈఎం అవతార్‌లో రిసోర్స్-రిచ్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుందో లేదో చూడాలి.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




