- Telugu News Photo Gallery Technology photos Xiaomi launch new tablet xiaomi pad 5 features and price details
Xiaomi pad 5: మార్కెట్లోకి షావోమీ కొత్త ట్యాబ్లెట్.. ప్రారంభ ఆఫర్ కింద రూ. 3 వేలు డిస్కౌంట్..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ తాజాగా కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ప్యాడ్ 5 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్ జూన్ 13వ తేదీన సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓ లుక్కేయండి..
Updated on: Jun 13, 2023 | 12:47 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేసింది. ప్యాడ్ 5 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్ జూన్ 13 తేదీ నుంచి అందుబాటులోకి వస్తోంది.

షావోమీ ప్యాడ్ 5 పేరుతో తీసుకొచ్చిన ట్యాబ్లెట్ బేస్ వేరియంట్.. 6GB + 128GB RAM స్టోరేజ్ ధర రూ. 26,999. ప్రారంభ ఆఫర్ కింద రూ.1000 తగ్గింపుతో రూ. 25,999కే లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 2,000 తగ్గింపు కూడా లభిస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 10.95 ఇంచెస్ 2.5కే+ డిస్‌ప్లేను అందించారు. ఇక ట్యాబ్లెట్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860 SoCని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 12పై MIUI 13 తో పని చేస్తుంది.

ఈ ట్యాబ్లెట్‌లో డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో పాటు క్వాడ్ స్పీకర్‌లను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 33వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 8,720mAh బ్యాటరీని అందించారు.




