EV Bike: ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఈవీ బైక్ లాంచ్.. ఆ మేటర్‌లో తగ్గేదేలే..!
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. అయితే కొన్ని స్టార్టప్ ఈవీ కంపెనీలకు డీలర్‌షిప్ అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో తమ వాహనాలను అందుబాటులో ఉంచడానికి ఈ-కామర్స్ సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా అమ్మకాలు చేస్తున్నాయి. ప్రముఖ ఈవీ కంపెనీ మేటర్ ఈవీ తన గేర్డ్ ఈవీ మోటర్ సైకిల్ అయిన గేర్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ ఈవీ కంపెనీ అయిన మేటర్ తన గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయిన ఏరాను ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంచింది. రూ.1,83,308 (ఎక్స్- షోరూమ్) ప్రారంభ ధరకు ఈ బైక్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్స్ డేస్ సేల్’తో పాటు మ్యాటర్ ఏరా లాంచ్ ప్రకటించారు. ముఖ్యంగా మేటర్ కంపెనీ ఈ సేల్‌లో ఈ బైక్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బైక్‌ను కొనుగోలు చేసిన వారికి రూ.39,827 వరకు మల్టీ డిస్కౌంట్లతో పాటు ప్రోత్సాహకాలను అందిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లో అందించే ఆఫర్స్‌లో భాగంగా ప్రత్యేక లాంచ్ ధర, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫ్లాట్‌ఫారమ్ నిర్దిష్ట తగ్గింపు, పరిమిత-కాల క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఉన్నాయి. అధిక స్పెక్ మ్యాటర్ ఏరా 5000+ ఎలక్ట్రిక్ మోటార్ బైక్ ఆర్ రూ.1,93,826 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దేశంలో అధునాతన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్వీకరణను ప్రోత్సహించడానికి తీసుకునే చర్యల్లో భాగంగా ఈ స్కూటర్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏరా స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే మేటర్ ఏరా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సెగ్మెంట్‌కు మాన్యువల్ గేర్బాక్స్‌ను పరిచయం చేసింది. ఈ బైక్‌లో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌తో 4 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఆకట్టుకుంటుంది.
మేటర్ ఏరాఈవీ బైక్ వైవిధ్యమైన రైడ్ కాంబినేషన్లను అనుమతిస్తుంది. సాధారణంగా సాంప్రదాయ ఈవీలు అందించే దానికంటే ఎక్కువ డైనమిక్ అనుభవాన్ని కోరుకునే రైడర్లను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బైక్ లిక్విడ్-కూల్డ్ పవర్ ట్రెయిన్‌తో ఆకట్టుకుటుంది. ఏరా 5 కేడబ్ల్యూహెచ్, ఐపీ67 రేటెడ్ బ్యాటరీతో కూడా వస్తుంది, ఇది ఒకే ఛార్జ్ పై 172 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ 2.8 సెకన్లలోపు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మేటర్ ఏరా నావిగేషన్, మీడియా, కాల్స్, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్ కు మద్దతుతో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డ్యాష్ బోర్డ్ ఉంది. ఈ బైక్‌లో హెూమ్ ఛార్జింగ్ కోసం 5 ఏఎంపీ సాకెట్లకు అనుకూలమైన స్టాండర్డ్ ఆన్ బోర్డ్ ఛార్జర్ కూడా ఉంది. అలాగే రియల్ టైమ్ డేటా యాక్సెస్, రిమోట్ లాకింగ్, జియో-ఫెన్సింగ్, మెయిన్‌టెన్స్ అలెర్ట్స్ అందించే మొబైల్ యాప్ కూడా వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








