Airtel Offer: ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్.. కొత్త వై-ఫై కనెక్షన్‌పై రూ.700 తగ్గింపు!
Airtel Offer: మీరు ఎయిర్‌టెల్ కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసుకుంటే మీరు రూ. 700 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ క్రికెట్ ప్రమోషనల్ ప్రచారంలో భాగం. IPL 2025 క్రేజ్ పెరుగుతున్న కొద్దీ Airtel తన ప్రీపెయిడ్..

Airtel Offer: మీరు మీ ఇంటికి లేదా కార్యాలయానికి కొత్త Wi-Fi కనెక్షన్ పొందాలని ఆలోచిస్తుంటే, మీకో శుభవార్త ఉంది. భారతదేశపు ప్రసిద్ధ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఇప్పుడు మీరు ఎయిర్‌టెల్ కొత్త ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను తీసుకుంటే మీరు రూ. 700 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ క్రికెట్ ప్రమోషనల్ ప్రచారంలో భాగం. IPL 2025 క్రేజ్ పెరుగుతున్న కొద్దీ Airtel తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌లను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్ గురించి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్ ఏమిటి?
ఈ డిస్కౌంట్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు మాత్రమే అని ఎయిర్‌టెల్ తెలిపింది. మీరు మొదటిసారి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ తీసుకొని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే, దానిపై రూ.700 తగ్గింపు పొందవచ్చు.
డిస్కౌంట్ ఎలా పొందాలి?
ఈ ఆఫర్ పొందడానికి మీరు ముందుగా ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను సందర్శించడం ద్వారా కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను బుక్ చేసుకోవాలి. కానీ ఈ సౌకర్యం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందిస్తుందని గుర్తించుకోండి. అందుకే ముందుగా ఈ సేవ మీ ప్రాంతంలో అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఫీచర్లు:
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ 100 Mbps నుండి 1 Gbps వరకు వేగవంతమైన, నమ్మదగిన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. దీనిలో కంపెనీ మీకు ఉచిత Wi-Fi రౌటర్, ఇన్‌స్టాలేషన్‌ను అందిస్తుంది. కంపెనీ వ్యక్తులే మీ ఇంటికి వచ్చి రౌటర్‌ను వారే ఇన్‌స్టాల్ చేస్తారు. కొన్ని ఎయిర్‌టెల్ ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి OTT యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, దాని కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా చురుగ్గా ఉంటుంది. కంపెనీ కస్టమర్ సపోర్ట్ సర్వీస్ 24/7 యాక్టివ్‌గా ఉంటుంది. ఇది పరిమిత కాల ఆఫర్. ఇది IPL సీజన్ 2025 వరకు చెల్లుబాటు అవుతుంది. అందుకే మీరు కొత్త బ్రాడ్‌బ్యాండ్ పొందాలని ఆలోచిస్తుంటే ఇది ఉత్తమ అవకాశం కావచ్చు.
మరిన్ని బిజినెస్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




