AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chat GPT: ఆటో డ్రైవర్‌తో బేరాలాడిన చాట్‌జీపీటీ.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్..!

ప్రస్తుత రోజుల్లో పెరిగిన టెక్నాలజీ వల్ల తమ కష్టాలకు చెక్ పెడుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు భాష అనేది చాలా సమస్యగా మారుతుంది. అయితే ఇలాంటి ఇబ్బందికి చెక్ పెడుతూ ఓ వ్యక్తి చాట్ జీపీటీను ఉపయోగించాడు. అంతేకాదు ఆటో డ్రైవర్‌తో చాట్ జీపీటీ సాయం బేరం ఆడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.

Chat GPT: ఆటో డ్రైవర్‌తో బేరాలాడిన చాట్‌జీపీటీ.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్..!
Chat Gpt
Nikhil
|

Updated on: May 03, 2025 | 3:23 PM

Share

ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాటిని రోజువారీ జీవితంలో ఉపయోగించడానికి సృజనాత్మకమైన, ఆశ్చర్యకరమైన మార్గాలను కనుగొంటున్నారు. ఈ-మెయిల్‌లు రాయడానికి, గణిత సమస్యలను పరిష్కరించడానికి ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించడం విద్యార్థులకు రోజువారీ పనిగా మారింది. భారతదేశంలో ప్రాంతానికి అనుగుణంగా ప్రాంతీయ భాషలు ఉంటాయి. అయితే చదువుకున్న వారు ఇంగ్లిష్‌తో కమ్యూనికేట్ చేసుకున్నా డ్రైవర్లు వంటి వారికి మనం ఏం చెబతున్నామో? అర్థం కాదు. ఈ నేపత్యంలో ఓ ఔత్సాహికుడు ఆటో డ్రైవర్‌తో ఏఐ సాయంతో సంభాషణ స్టార్ట్ చేశాడు.

కర్ణాటకలో ఒక కంటెంట్ సృష్టికర్త కన్నడ భాషలో ఆటో ఛార్జీలను బేరసారాలు చేయడానికి ఏఐను ఉపయోగించాడు. ఈ వీడియోను బెంగళూరులో చిత్రీకరించారు. ముఖ్యంగా ఏఐ వాయిస్ ఫీచర్ సాయంతో ఆటో డ్రైవర్ కిరాయి రూ.200 చెబితే దాన్ని రూ.100 తగ్గించాలని కోరాడు. తాను విద్యార్థినని, తరచూ ఇదే దారిలో వెళ్తాను అని కన్నడలో ఏఐ వాయిస్ ఫీచర్‌ సాయంతో అనువదించాడు. ఇలా క్రమేపి ఆటో డ్రైవర్ కిరాయిను రూ.120కు ఫైన్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లను మిశ్రమంగా స్పందిస్తున్నారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. 

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sajan Mahto (@sajanmahto.ai)

అయితే ఈ వీడియో స్క్రిప్టెడ్ వీడియో అని చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. చాలా మంది ఊహించినట్లుగా ఇది స్క్రిప్టెడ్ వీడియో అని అతను నిజమైన ఆటో డ్రైవర్ కాదని వీడియోలో చెప్పారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ భాషా అంతరాలను ఎలా తగ్గిస్తుందో? చూపించాలనే తలంపుతో వీడియో చేశామని అతను పేర్కొన్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి