Skoda EV Bike: ఈవీ బైక్ మార్కెట్‌లోకి స్కోడా.. కాన్సెప్ట్ ఈవీ బైక్ అదిరిందిగా..!
ప్రపంచవ్యాప్తంగా స్కోడా కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ప్రీమియం లుక్‌తో పాటు అధునాతన ఫీచర్లకు స్కోడా పెట్టింది పేరు. అయితే ఇటీవల స్కోడా ఈవీ బైక్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా పలు కాన్సెప్ట్ ఈవీ బైక్స్‌ను ప్రకటిస్తూ ఆటో మొబైల్ రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో స్కోడా కాన్సెప్ట్ ఈవీ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇప్పటివరకు కార్ల తయారీ బ్రాండ్‌గానే ఉన్న స్కోడా ఆటో త్వరలో మోటార్‌బైక్‌లను తయారు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే స్కోడా కంపెనీ స్లావియా బి కాన్సెప్ట్ ఈవీ బైక్‌ను ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ బైక్ లౌరిన్ & క్లెమెంట్ ఉత్పత్తి చేసిన మొట్టమొదటి మోటార్‌సైకిల్ స్కోడా బిని పోలి ఉంటుంది. స్కోడా బి 1899 ప్రాంతంలో ప్రారంభించారు. అలాగే ఈ బైక్ 240 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్ 1.75 హెచ్‌పీ గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అలాగే ఈ బైక్ గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. స్కోడా బికి గేర్‌బాక్స్ లేదు. అలాగే వెనుక చక్రాలకు శక్తినిచ్చే ఫ్లాట్ బెల్ట్‌తో వస్తుంది. 1899-1904 మధ్య ఎల్&కే కేవలం 540 యూనిట్ల మోటార్‌సైకిళ్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇప్పుడు, స్కోడా స్లావియా బికి రొమైన్ బుకైల్ రూపొందించిన ఎలక్ట్రిక్ అవతార్‌తో మన ముందుకు వచ్చింది.
స్కోడా స్లావియా బి కాన్సెప్ట్ కొత్తగా ప్రారంభం కావచ్చు. స్కోడా బి ఫ్రేమ్‌లో ఒక ఇంజిన్‌ను ఉంచారు. బుకైల్ ఆ నిర్దిష్ట స్థలాన్ని ఖాళీగా ఉంచి, ఫ్లోటింగ్ ఎల్&కే లోగోను జోడించి కాన్సెప్ట్ బిని రూపొందించారు. ఈ డిజైన్ వివరాలతో పాటు స్కోడా స్లావియా బి కాన్సెప్ట్‌లో యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్కులు, పెద్ద అల్లాయ్ వీల్స్, తక్కువ సెట్ హ్యాండిల్ బార్ వంటి అంశాలు కేఫ్-రేసర్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. స్లావియా బిలో ఖాళీ ఫ్రేమ్ వెనుక అమర్చిన లెదర్ సీటు, టూల్ బ్యాగ్ కూడా ఉంటాయి.
స్కోడా బి కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్‌లు, భవిష్యత్ విధానాలను రూపొందించడంలో బ్రాండ్‌కు సంబంధించిన సృజనాత్మకతను ప్రదర్శిస్తుంది. అయితే బి కాన్సెప్ట్ లాంచ్ గురించి ఇంకా ఎటువంటి వివరాలు లేవు. ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన స్పెక్స్ గురించి బ్రాండ్ కూడా అధికారికంగా ఎలాంటి వివరాలను తెలపడం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








