Maruti Suzuki: 2,555 కార్లను వెనక్కి పిలిచిన మారుతీ సుజుకీ.. అందులో మీ కారుందా?
మారుతీ సుజుకీ ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్లో కారు స్టీరింగ్, గేర్‌బాక్స్ అసెంబ్లింగ్‌లో లోపాన్ని గుర్తించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దాదాపు 2555 కార్లలో ఈ లోపాలను గుర్తించినట్లు చెప్పారు. దీంతో మొత్తం 2555 మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిని సరి చేయకుండా వినియోగదారులు ఎవరూ కార్లను వాడవద్దని సూచించింది.
మీరు మారుతి సుజుకీ కార్లు వినియోగిస్తున్నారా? అయితే మీకో అలర్ట్. కొన్ని లోపాల కారణంగా మారుతి సుజుకీ ఆల్టో కే10 మోడల్ కార్ల పెద్ద సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. ఆ లోపభూయిస్ట భాగాలను భర్తీ చేయకుండా కార్లను డైవ్ చేయొద్దని కూడా తన వినియోగదారులను మారుతీ సుజుకీ హెచ్చరించింది. అసలు కంపెనీ గుర్తించిన లోపాలేంటి? ఆ కార్లు వినియోగిస్తున్న కస్టమర్లు ఏం చేయాలి? తెలియాలంటే ఈ కథనం చదవండి..
లోపం ఏమిటంటే..
మారుతీ సుజుకీ ఆల్టో కే10 హ్యాచ్‌బ్యాక్లో కారు స్టీరింగ్, గేర్‌బాక్స్ అసెంబ్లింగ్‌లో లోపాన్ని గుర్తించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దాదాపు 2555 కార్లలో ఈ లోపాలను గుర్తించినట్లు చెప్పారు. దీంతో మొత్తం 2555 మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిని సరి చేయకుండా వినియోగదారులు ఎవరూ కార్లను వాడవద్దని సూచించింది.
ఏం చేయాలంటే..
మారుతి ఆల్టో కే10ని కలిగి ఉన్న వినియోగదారులు తమ కారును అధీకృత మారుతి సుజుకీ డీలర్‌షిప్ వద్ద తనిఖీ చేసుకోవచ్చు. ఇది కాకుండా, వారు సమీపంలోని ఎంఎస్ఐ సేవా కేంద్రాన్ని కూడా సందర్శించవచ్చు. లోపాన్ని తనిఖీ చేయవచ్చు. కంపెనీ దెబ్బతిన్న భాగాలను భర్తీ చేస్తుంది. ఇది ఫ్రీగానే చేస్తుంది. కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేయదు. ఈ సమస్యలు కారు డ్రైవబిలిటీ, హ్యాండ్లింగ్‌కు దారితీస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రభావితమైన కార్ల యజమానులు తమ వాహనాలను నడపవద్దని సూచించింది. ఇదిలా ఉంటే, మారుతి సుజుకీ లోపభూయిష్ట యూనిట్ల తయారీ తేదీని వెల్లడించలేదు.
మారుతీ ఆల్టో కే10 స్పెసిఫికేషన్లు..
చిన్న కార్లలో ప్రసిద్ధి చెందిన మారుతీ సుజుకీ ఆల్టో కే10లో 998సీసీ, 1.0 లీటర్, 3-సిలిండర్ డ్యూయల్ జెట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 66.62పీఎస్, 89ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి సెలెరియో కూడా అదే ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది కాకుండా, ఈ కారు సీఎన్జీ ఎంపికతో కూడా వస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కే10 నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్. ఈ వాహనం మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రే, స్పీడీ బ్లూ, పెరల్ మిడ్‌నైట్ బ్లాక్, సాలిడ్ వైట్, ప్రీమియం ఎర్త్ గోల్డ్ వంటి కలర్ ఆప్షన్‌లలో కూడా వస్తుంది. తమ పెట్రోల్ మోడల్ లీటరుకు 24.90 కిమీ మైలేజీని ఇవ్వగలదని, సీఎన్‌జీ మోడల్ కిలోకు 33.85 కిమీ మైలేజీని ఇవ్వగలదని కంపెనీ తెలిపింది.
ఆల్టో కే10 ఫీచర్లు..
ఆల్టో కే10లో ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్‌గా సర్దుబాటు చేయగల ఓఆర్వీఎంలు, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు ప్రస్తుతం కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న చవకైన కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు ఉంది. ఇది భారతీయ మార్కెట్లో రెనాల్ట్ క్విడ్, మారుతి ఎస్-ప్రెసోతో పోటీపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..