Maruti Suzuki Offers: పాపులర్ కార్లపై టాప్ లేపే ఆఫర్స్.. స్టాక్ ఉన్నంత వరకూ అవకాశం.. త్వరపడండి..
మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం అయిన మారుతి సుజుకీ తన పాపులర్ మోడల్ కార్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. క్లియరెన్స్ సేల్ కింద ఈ ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్లు పేర్కొంది. 2023లో తయారైన మోడళ్లు.. ఇంకా అమ్ముడుపోకుండా ఉన్న వాటిపై భారీ తగ్గింపు ధరలను ఇస్తోంది.

మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం అయిన మారుతి సుజుకీ తన పాపులర్ మోడల్ కార్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. క్లియరెన్స్ సేల్ కింద ఈ ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నట్లు పేర్కొంది. 2023లో తయారైన మోడళ్లు.. ఇంకా అమ్ముడుపోకుండా ఉన్న వాటిపై భారీ తగ్గింపు ధరలను ఇస్తోంది. స్టాక్ ఉన్నంత వరకూ ఈ ఆఫర్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి ఫ్యాక్టరీ ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి డీలర్లు 2023 చివరి నాటికి అధిక మొత్తంలో స్టాక్‌లను పెట్టారు. అయినప్పటికీ విక్రయాల సంఖ్య తక్కువగా ఉంది. ఈ క్రమంలో 2023 మోడళ్లను క్లియర్ చేసేందుకు ఆఫర్లను కొనసాగిస్తున్నాయి. మారుతి సుజుకీ గ్రాండ్ విటారా, ఇగ్నిస్, సియాజ్, జిమ్నీ వంటి మోడళ్లపై తగ్గింపు లభిస్తోంది. ఆ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్.. మారుతి సుజుకీ గ్రాండ్ విటారా హైబ్రిడ్, ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌లపై వరుసగా రూ. 79,000 , రూ. 83,000 తగ్గింపు లభిస్తోంది. అదనంగా, చాలా మంది మారుతీ డీలర్లు అమ్మకాలను మరింత పెంచడానికి అన్ని మోడళ్లపై రూ. 50,000 అదనపు నగదు తగ్గింపును అందిస్తున్నారు. మొత్తం మీద 2023 గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్ వేరియంట్‌లపై మొత్తం ప్రయోజనాలు రూ. 1.30 లక్షల వరకూ ఉంటుంది.
ఇగ్నిస్, సియాజ్.. మారుతి సుజుకీ ఇగ్నిస్, సియాజ్ 2023 మోడళ్లపై వరుసగా రూ. 61,000, రూ. 48,000 అధికారిక తగ్గింపులు వస్తాయి. అయితే, చాలా డీలర్‌షిప్‌లలో రెండు మోడళ్లకు రూ. 1 లక్షకు పైగా తగ్గింపుతో అందిస్తున్నట్లు చెబుతున్నారు.
జిమ్నీ.. మారుతి సుజుకీ జిమ్నీ కారుపై అధికారికంగా రూ. 1.50 లక్షల తగ్గింపుతో పాటు, విక్రయాలను పెంచడానికి మారుతి సుజుకి థండర్ ఎడిషన్‌పై తాత్కాలికంగా ధరలను తగ్గించింది. థండర్ ఎడిషన్ ఆఫర్‌లు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ, డీలర్లు అధికారిక ఆఫర్‌పై అదనంగా రూ. 50,000 తగ్గింపును అందజేస్తున్నారు. అయితే దీని స్టాక్ చాలా తక్కువగానే ఉంది. ఇప్పటికే చాలా డిస్కౌంట్ యూనిట్లు అమ్మడయ్యాయి.
ఇది గుర్తుంచుకోండి..
ఈ తగ్గింపులు ప్రాథమికంగా క్లియరెన్స్ ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి అని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తగ్గిన ధర ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, సంభావ్య కొనుగోలుదారులు, ముఖ్యంగా రాబోయే 3-5 సంవత్సరాలలో తమ కారును విక్రయించాలని ప్లాన్ చేస్తున్నవారు, పునఃవిక్రయం విలువపై ప్రభావాన్ని పరిగణించాలి. కారు ఒక సంవత్సరం పాతది కాబట్టి, కొత్త 2024 మోడల్‌తో పోలిస్తే ఇది తక్కువ ధరను పొందవచ్చు. అయితే, వాహనాన్ని ఎక్కువ కాలం పాటు ఉంచాలని భావించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








