సంచలనాలకు సిద్ధమైన మారుతి సుజుకి.. ఇండియాలోనే అత్యధిక మైలేజ్‌ కారుతో మార్కెట్‌లోకి ఎంట్రీ.. పూర్తి వివరాలు మీకోసం..!

New Maruti Celerio: సరికొత్త సెలెరియోను కేవలం రూ. 11,000లతో బుక్ చేసుకోవచ్చని ఆటో మేజర్ ఒక ప్రకటనలో తెలిపింది.

సంచలనాలకు సిద్ధమైన మారుతి సుజుకి.. ఇండియాలోనే అత్యధిక మైలేజ్‌ కారుతో మార్కెట్‌లోకి ఎంట్రీ.. పూర్తి వివరాలు మీకోసం..!
New Maruti Celerio
Venkata Chari

|

Nov 06, 2021 | 8:47 AM

New Maruti Celerio: మారుతి సుజుకి ఇండియా (MSI) హ్యాచ్‌బ్యాక్ సెలెరియో సరికొత్త వెర్షన్ ప్రీ-లాంచ్ బుకింగ్‌లను ప్రారంభించింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కొత్త మారుతి సెలెరియోను నవంబర్ 10న భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. సరికొత్త సెలెరియోను కేవలం రూ. 11,000లతో బుక్ చేసుకోవచ్చని ఆటో మేజర్ ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌టీ ఆటో ప్రకారం మారుతి సుజుకి కొత్త సెలెరియో 26 kmpl మైలేజీని అందించగలదని పేర్కొంది.

“ప్రారంభించినప్పటి నుంచి సెలెరియో తన ప్రత్యేకమైన శైలి, విప్లవాత్మక ఆటో గేర్ షిఫ్ట్ (AGS) సాంకేతికతతో మార్కెట్‌‌లో సంచలనం తీసుకోచ్చింది. ఇది దేశంలో టూ-పెడల్ టెక్నాలజీని తీసుకరానుంది. బ్రాండ్ సెలెరియో లెటెస్ట్ టెక్నాలజీ, ఆధునికతలకు ప్రతి రూపంగా నిలిచిందని MSI సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ & సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

కొత్త పెట్రోల్ ఇంజన్, శక్తివంతమైన, స్టైలిష్ డిజైన్‌తో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో సరికొత్త సెలెరియో ఆల్ రౌండర్‌గా నిలిచింది. ఈ మోడల్ కాంపాక్ట్ సెగ్మెంట్‌ను మరోసారి శక్తివంతం చేస్తుందని కంపెనీ విశ్వసిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

“నెక్స్ట్-జెన్ కె-సిరీస్ ఇంజన్‌తో సెగ్మెంట్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీతో, సరికొత్త సెలెరియో భారతదేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారుగా నిలుస్తుంది” అని MSI చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ (ఇంజనీరింగ్) CV రామన్ తెలిపారు.

కొత్త డిజైన్, 3D ఆర్గానిక్ స్కల్ప్టెడ్ డిజైన్‌తో డైనమిక్ క్యారెక్టర్‌లతో కూడిన సెలెరియో ఆకట్టుకోనుందని ఆయన తెలిపారు. ఫ్రంట్ ఫాసియా పూర్తిగా కొత్త రేడియంట్ గ్రిల్‌తో పదునైన క్రోమ్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. ఇది అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్‌తో వినియోగదారులను ఆకర్షిస్తుందని కంపెనీ పేర్కొంది.

Also Read: Bank Loan: బ్యాంకు లోన్ కావాలనుకుంటున్నారా…? తక్కువ వడ్డీకే రుణాలు అందించే బ్యాంకులు ఇవే..!

Ola Grocery Delivery: వినియోగదారులకు ఓలా గుడ్‌న్యూస్‌.. ఆన్‌లైన్‌లో కిరాణా సరుకుల డెలివరీ..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu