- Telugu News Photo Gallery Business photos Ola begins pilot of quick grocery delivery service in Bengaluru
Ola Grocery Delivery: వినియోగదారులకు ఓలా గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో కిరాణా సరుకుల డెలివరీ..!
Ola Grocery Delivery: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ సేవలు పెరిగిపోయాయి. వివిధ రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పై లభిస్తున్నాయి. ఇక నిత్యావసర వస్తువులను ..
Subhash Goud | Edited By: Ravi Kiran
Updated on: Nov 06, 2021 | 6:24 AM

Ola Grocery Delivery: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ సేవలు పెరిగిపోయాయి. వివిధ రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పై లభిస్తున్నాయి. ఇక నిత్యావసర వస్తువులను కూడా ఆన్‌లైన్‌లో చేస్తే డెలివరి ఇస్తు్న్నాయి.

ఇక ఆన్‌లైన్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలు అందించే ఓలా.. తాజాగా కిరాణా సరుకులు, వ్యక్తిగత ఉత్పత్తులు, పెంపుడు జంతు సంరక్షణ ఉత్పత్తుల డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టింది.

ఓలా స్టార్ పేరుతో బెంగళూరులో పైలర్ ప్రాజెక్టుగా ఈ సేవలను ప్రారంభించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ రంగంలోకి దిగినట్లు చెబుతోంది.

మరికొన్ని నెలల్లో భారత్‌లోని ప్రధాన నగరాలలో సైతం ఈ కిరాణా వస్తువుల డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కస్టమర్లకు ఆర్డర్ చేసిన 15 నిమిషాల్లోపే సరుకులను చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఓలా తెలిపింది.





























