Maruti Suzuki: రూ. 8 లక్షల్లో మారుతి కొత్త కారు.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్స్‌తో
ఈ కారు మొత్తం 14 వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఫ్రాంక్స్ వెలాసిటీ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఎస్‌యూవీ కారు ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.29 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.2 సిగ్మా వెలాసిటీ ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్, వీల్ఆర్చ్లతో పాటు..
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతికి భారత్‌లో ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాహనాల్లో మారుతి సుజుకి ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త వాహనాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్న మారుతి సుజుకి తాజాగా మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌కి సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ పేరుతో ఈ కారును లాంచ్ చేశారు. ఇంతకీ కారు ధర ఎంత.? ఎలాంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కారు మొత్తం 14 వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఫ్రాంక్స్ వెలాసిటీ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఎస్‌యూవీ కారు ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.29 లక్షలుగా నిర్ణయించారు. ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 1.2 సిగ్మా వెలాసిటీ ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్, వీల్ఆర్చ్లతో పాటు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్లలో, ఫ్రాంక్స్ డెల్టా + వెలాసిటీ లోయర్ ట్రిమ్స్ నుంచి అన్ని గార్నిష్ ఎలిమెంట్స్‌ను అందించారు.
ఇక కార్బన్ ఫినిష్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, 3డీ బూట్ మ్యాట్ వంటి ఇంటీరియర్ యాక్సెసరీలు ఈ కారు ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. బోల్డ్ ఎస్‌యూవీ అనుభవాన్ని కోరుకునే వారి కోసం ఈ కారు ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థు బెనర్జీ తెలిపారు. ఈ కారు కేవలం పది నెలల్లో లక్ష అమ్మకాలను సాధించిందని తెలిపారు.
ఇక మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎమ్టీతో జతచేసిన ఫ్రాంక్స్లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేసిన స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మరింత పవర్ ప్యాక్ చేసిన 1.0-లీటర్ బూస్టర్ జెట్‌ను కూడా ఇచ్చారు. ఇక 1.2-లీటర్ సీఎన్‌జీ వెర్షన్ కూడా అందించారు. సీఎన్‌జీ కిలోకు 28.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఇన్ఫోమేట్ సిస్టమ్ విషయానికొస్తే ఇందులో ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో హెడ్-అప్ డిస్ప్లే, 360-కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..