Maruti Suzuki Fronx: ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. ధర ఎంతంటే..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రదర్శించిన ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. తాజాగా ఫ్రాంక్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నెక్సా డీలర్ షిప్ ద్వారా విక్రయించనున్న ఈ కార్లకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

దేశీయ ఆటో మొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. సంస్థ నుంచి ఏ కొత్త ప్రకటన వచ్చినా వినియోగదారులకు దానిపై అమితమైన ఆసక్తి కనబరుస్తారు. ఇక కొత్త కారొచ్చిందంటే దాని కోసం ఎగబడతారు. కాగా కారు కొనుగోలు దారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. జనవరిలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ ఎస్‌యూవీని ప్రదర్శించిన ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. తాజాగా ఫ్రాంక్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నెక్సా డీలర్ షిప్ ద్వారా విక్రయించనున్న ఈ కార్లకు సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ కారులోని ఫీచర్లు, డిజైన్, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
లుక్ అండ్ డిజైన్.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్ యూవీ స్పోర్టీ, స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. కారు ఫ్రంట్ ఎండ్ ఇటీవల విడుదల చేసిన గ్రాండ్ విటారా మోడల్ లా ఉంటుంది. కారు ప్రొఫైల్‌లో కూపే లాంటి C-పిల్లర్‌ను కూడా పొందుతుంది. వెనుక భాగం అంతటా ఎల్ఈడీ స్ట్రిప్, సిగ్నేచర్ ఎల్ఈడీ బ్లాక్ టెయిల్ లైట్లు ఉంటాయి.
ఫీచర్లు.. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈకారు వస్తుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి కనెక్ట్, వాయిస్ కమాండ్‌లను వంటి అదనపు ఫీచర్లను కలిగి ఉంది. ఇది డిజిటల్ కన్సోల్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, వెనుక ఏసీ వెంట్‌లను కూడా కలిగి ఉంది. ఏబీఎస్, ఈబీడీ, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్ తో పాటు హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
రెండు ఇంజిన్లు.. ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది. 1.2-లీటర్ కే-సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89.7 PS వద్ద 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మరొక ఇంజన్ 1.0-లీటర్ కే-సిరీస్ టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 100 PS వద్ద 147.6 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో వినియోగదారులు 5 స్పీడ్ మాన్యువల్ అలానే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతారు.
ధర ఎంతంటే.. కొత్త ఫ్రాంక్స్ కూపే ఎస్ యూవీ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా,ఆల్ఫా అనే ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లు తమకు ఇష్టమైన వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. వేరియంట్ ని బట్టి ధర మారుతూ వస్తుంది. బేసిక్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు అందుబాటులో దీని ధరలు ఉన్నాయని చెప్పవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 6.75 ఎక్స్ షోరూం ఉంటుంది. నెక్సా షోరూంలలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..