Car Loan: మీ పాత కారుపై రుణం పొందవచ్చా..? ఎంత వడ్డీ ఉంటుంది?
ఈ మధ్య కాలంలో కార్లపై మోజు పెరిగిపోతోంది. కరోనా తర్వాత ఎంతో మంది కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే స్థోమత ఉన్నవారు కొత్తకారు, స్థోమత లేనివారు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కారు కొనుగోలు కోసం కూడా బ్యాంకు నుంచి, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా రుణం పొందవచ్చు. మీరు..

ఈ మధ్య కాలంలో కార్లపై మోజు పెరిగిపోతోంది. కరోనా తర్వాత ఎంతో మంది కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే స్థోమత ఉన్నవారు కొత్తకారు, స్థోమత లేనివారు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కారు కొనుగోలు కోసం కూడా బ్యాంకు నుంచి, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా రుణం పొందవచ్చు. మీరు ఇప్పటికే కొనుగోలు చేసిన కారుపై లోన్ ఎలా పొందవచ్చనే డైలమాలో ఉంటారు. హోమ్ లోన్ కోసం ఆస్తిని తనఖా పెట్టినట్లు, అదే విధంగా, కారుపై లోన్ తీసుకోవచ్చు. దీనిని ‘కారు లోన్’ అంటారు. మీ కారుపై మీరు ఎప్పుడు, ఎలా లోన్ పొందవచ్చు? ఇది మంచి ఆప్షనేనా..? మీరు అటువంటి రుణాన్ని ఎప్పుడు తీసుకోవచ్చు? మీరు రుణంగా ఎంత డబ్బు పొందవచ్చు? అనే విషయాలను తెలుసుకుందాం..
కారుపై రుణం అంటే ఏమిటి? దానిని ఎవరు తీసుకోవచ్చు? అనేదాని గురించి ఇప్పుడు చూద్దాం. కారుపై లోన్ సురక్షిత రుణం. మీరు మీ కారును తాకట్టుగా ఉంచుతూ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కారు లోన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నిధులను సేకరించేందుకు ఇది ఒక ప్రయోజనకరమైన ఆప్షన్ అనే చెప్పాలి. 21 సంవత్సరాల కంటే ఎక్కువ, 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే సాలరీ పొందే ఉద్యోగులకు వయోపరిమితి 60 సంవత్సరాలు.
కారుపై ఎవరు ఎంత రుణం ఇస్తారు?
చాలా బ్యాంకులు, NBFCలు కారుపై రుణాలను అందిస్తాయి. మీరు వారి వెబ్‌సైట్‌లో లేదా నేరుగా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్ కోసం అప్లై చేసిన తర్వాత ఆర్థిక సంస్థ కారు విలువను అంచనా వేస్తుంది. సాధారణంగా కారు విలువలో 50% నుంచి 150% వరకు రుణంగా మంజూరు చేయవచ్చు. ఇప్పుడు దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం..



ఓ వ్యక్తి తన కారుపై రుణం తీసుకున్నాడని అనుకుందాం.. ఆ తర్వాత బ్యాంక్ దాని విలువను అంచనా వేస్తుంది. అతని కారు విలువను బ్యాంకు 10 లక్షల రూపాయలు అని అనుకుందాం. అప్పుడు మనోజ్ 2.5 లక్షల రూపాయల నుంచి 7.50 లక్షల రూపాయల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది.
కారు వాల్యుయేషన్ ఎలా లెక్కిస్తారు?
కారు వాల్యు యేషన్ అనేది ఆయా బ్యాంకుల మీద ఆధారపడి ఉంటుంది. దీనికోసం ఒక్కో బ్యాంకు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంది. కారు కంపెనీ.. రకం.. సంవత్సరం.. ఇలా చాలా పారామీటర్స్ తీసుకుంటారు. ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. లోన్ మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు బ్యాంక్ లేదా NBFC మీ ఆదాయం, రీపేమెంట్ కెపాసిటీ, క్రెడిట్ హిస్టరీ మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. రీపేమెంట్ వ్యవధి 12 నుంచి 84 నెలల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు. అంతేకాకుండా ఆర్థిక సంస్థలు 1% నుంచి 3% వరకు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తాయి.
కారు రుణంపై వడ్డీ రేటు ఎంత?
కారు రుణాల విషయంలో వడ్డీ రేట్లు సాధారణంగా 14% నుంచి 18% వరకు ఉంటాయి. IDFC ఫస్ట్ బ్యాంక్ వడ్డీ రేట్లు 14.49% నుంచి ప్రారంభమవుతాయి. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విషయంలో రేట్లు 13.75% నుంచి ప్రారంభమవుతాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఈ లోన్‌ను వ్యక్తిగత రుణాల కంటే 2% తక్కువకు అందజేస్తుందని పేర్కొంది. వివిధ ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. మీ దీర్ఘకాలిక పెట్టుబడులను విచ్ఛిన్నం చేయడం కంటే అత్యవసర పరిస్థితుల్లో ఆస్తిపై రుణం తీసుకోవడం ఉత్తమ ఆప్షన్‌గా పరిగణించబడుతుంది.
పర్సనల్ లోన్ – కార్ లోన్ మధ్య ఏది బెటర్ ఆప్షన్?
లోన్ తీసుకోవడం అనేది ముందుగా అనుసరించతగిన విధానం కాదు. మొదట్నుంచీ ప్లానింగ్ గా ఉంటూ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇక పర్సనల్ లోన్ మంచిదా? కార్ లోన్ మంచిదా అనే విషయానికి వస్తే.. పర్సనల్ లోన్ ఆన్ సెక్యూర్డ్ లోన్.. కార్ లోన్ సెక్యూర్డ్.. అందువల్ల కొద్దిగా వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి. పర్సనల్ లోన్ కంటే కార్ లోన్ లాంటి సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వడంలో బ్యాంకులు వేగంగా స్పందిస్తాయి. అందువల్ల అత్యవసరం అయితే.. కార్ లోన్ తీసుకోవడం మంచిదే.
ఏ రకమైన కార్లపై ఈ లోన్ అందుబాటులో ఉండదు?
సాధారణంగా 10 సంవత్సరాల కంటే తక్కువ పాత కార్లపై రుణాలు మంజూరు చేస్తాయి సంస్థలు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పాత కార్లపై రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు నిరాకరించవచ్చు. మీకు అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు లేకుంటే, మీరు ఈ రుణాన్ని పొందలేరు. బ్యాంకులు కూడా ఉత్పత్తిలో లేని మోడల్‌లను కలిగి ఉన్న కార్ల కోసం రుణాలు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అదనంగా అటువంటి రకాల రుణాలను పొందడంలో ఇబ్బంది ఉండవచ్చు. అలాగే వాణిజ్య వాహనాలపై రుణం పొందడంలో ఇబ్బంది ఉండవచ్చు.
ఒకవేళ కారు లోన్ లో తీసుకుని ఉన్నా కూడా కారుపై లోన్ ఇస్తారా ? అనే సదేహం చాలా మందిలో వస్తుంటుంది. అయితే, మీరు తీసుకున్న కారు లోన్ ఎంత వరకూ తీర్చారు అనేది ఇక్కడ ప్రధానమైనదిగా నిలుస్తుంది. ఉదాహరణకు ఒక కారు ఐదు లక్షలు అనుకుందాం. దానిపై నాలుగు లక్షలు లోన్ తీసుకున్నారని అనుకుందాం. మీరు మళ్ళీ లోన్ తీసుకునే సమయానికి మీ కారు విలువ 4 లక్షలు అనుకుంటే అప్పటికి మీరు తీర్చిన లోన్ లక్ష రూపాయలు అనుకుంటే.. మీకు మళ్ళీ ఆ కారుపై లోన్ రాదు. ఒకవేళ మీరు అప్పటికే లోన్ ఎక్కువగా తీర్చి ఉన్నట్టాయితే.. లోన్ వచ్చే అవకాశం ఉంటుంది
మరి రుణం మంజూరు అయిన తర్వాత బ్యాంక్ కారుని తీసుకుంటుందా?
మరి రుణం మంజూరు అయిన తర్వాత బ్యాంక్ కారుని తీసుకుంటుందా? అంటే అలాంటిదేమి ఉండదు. మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌లను చెల్లిస్తున్నంత వరకు మీరు కారును ఉపయోగించడం కొనసాగించవచ్చు. మీరు వాయిదాలను చెల్లించకుంటే మీ కారును సీజ్ చేసే చట్టబద్ధమైన హక్కు బ్యాంకుకు ఉంటుంది. కారు రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు వివిధ ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లను సరిపోల్చండి. అలాగే రీపేమెంట్ షరతులు కూడా తెలుసుకోండి. బ్యాంక్‌తో తక్కువ వడ్డీ రేట్లతో రుణం తీసుకునేందుకు చర్చించండి. బ్యాంకు లోన్ విషయంలో తొందర పాటుగా నిర్ణయాలు తీసుకోకండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




