- Telugu News Photo Gallery Buy These Top EV Bikes, Having 307 Km Range In Single Charge, Know the detail
కిర్రాక్ ఫీచర్లు, అదిరిపోయే రేంజ్.. ఈ 3 బైక్స్‌కు పెట్రోల్‌తో పన్లేదు.. 300 కి.మీ నాన్‌స్టాప్..
పెట్రోల్ ధరల బాదుడికి చాలామంది ఎలక్ట్రిక్ బైకులపై మొగ్గు చూపుతున్నారు. దీని ద్వారా మార్కెట్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఈ బైక్‌లలో అధిక రేంజ్, అదిరిపోయే ఫీచర్లతో కూడిన బైక్‌లు ఏంటో ఇప్పుడే తెలుసుకుందామా..!
Updated on: Apr 25, 2023 | 6:16 PM

కోమకి రేంజర్ ఎలక్ట్రిక్ బైక్: ఇది దేశీయ తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఇందులో 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిమీ రయ్.. రయ్.. అలాగే ఈ వాహనం టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. ఇక దీని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. దీని ధర రూ. 1.85 లక్షలు.

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్: ఇందులో 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్ టాప్ స్పీడ్ 100 కిమీ కాగా.. బ్యాటరీ 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ వాహనం ధర రూ. 1.5 లక్షలు.

అల్ట్రావాయొలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్: ఇది రెండు వేరియంట్లలో మార్కెట్‌లో లభిస్తోంది. అవే స్టాండర్డ్, రెకాన్. వీటితో పాటు స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.

స్టాండర్డ్ బైక్‌లో 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉండగా.. ఇది 206 కిమీ రేంజ్ అందిస్తుంది. అలాగే రెకాన్ వేరియంట్ బైక్‌లో 10.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీన్ని ఒక్కసారి చార్జ్ చేస్తే.. 307 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.

ఈ బైక్ ధర రూ. 3.8 లక్షల నుంచి 5.5 లక్షల వరకు ఉంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గంటకు 152 కిమీ. అలాగే ఈ బైక్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది.




