- Telugu News Photo Gallery Technology photos Oneplus launching first tab Oneplus pad features and price details Telugu Tech News
OnePlus pad: వన్‌ప్లస్ నుంచి తొలి ట్యాబ్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా.?
వన్‌ప్లస్ తమ బ్రాండ్ నుంచి తొలి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ట్యాబ్లెట్ విడుదలపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో తీసుకురానున్న ఈ ట్యాబ్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Apr 25, 2023 | 5:29 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ తన బ్రాండ్ నుంచి మొట్ట మొదటి ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ అమెజాన్‌తో పాటు, వన్‌ప్లస్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది.

ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ ఆర్డర్స్ మొదలు కానుంది. మే 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభంకానుంది. ధర విషయానికొస్తే 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 37,999. 12GB RAM + 256GB ధర రూ. 39,999గా ఉండనుంది.

ఇక ఈ ట్యాబ్లెట్ ఫీచరల్ విషయానికకొస్తే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 చిప్‌ను అందించారు. 2.8K రిజల్యూషన్, 7:5 స్క్రీన్ రేషియోతో కూడి11.61 ఇంచెస్ భారీ స్క్రీన్‌ను అందించారు.

డాల్బీ విజన్, డాల్బీ ఆట్మోస్ సపోర్ట్ ఉంది. అంతేకాకుండా 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 9510 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ట్యాబ్ ఆక్సీజన్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.





























