Ambani-Adani: తగ్గుతున్న ఆస్తులు.. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి ఔట్‌!

భారత స్టాక్ మార్కెట్ రెండు రోజులుగా భారీగా పతనమవుతోంది. ఈ క్షీణత కారణంగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆస్తులు గణనీయంగా తగ్గాయి. ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ 10లో వీరు లేరు. అయితే 2004కి ముందు పేరు తెలియని..

Ambani-Adani: తగ్గుతున్న ఆస్తులు.. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి ఔట్‌!
Follow us

|

Updated on: Oct 07, 2024 | 4:49 PM

భారత స్టాక్ మార్కెట్ రెండు రోజులుగా భారీగా పతనమవుతోంది. ఈ క్షీణత కారణంగా రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆస్తులు గణనీయంగా తగ్గాయి. ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ 10లో వీరు లేరు. అయితే 2004కి ముందు పేరు తెలియని వ్యక్తి గత తొమ్మిది నెలల్లో 78 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.6.52 లక్షల కోట్లు సంపాదించాడు. ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్.

2004లో ఫేస్‌బుక్‌

మార్క్ జుకర్‌బర్గ్ 20 ఏళ్ల క్రితం 2004లో ఫేస్‌బుక్‌ని స్థాపించారు. ఇప్పుడు కేవలం 20 ఏళ్లలో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను మెటా సీఈవో జుకర్‌బర్గ్ అధిగమించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ 206.2 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు 17.22 లక్షల కోట్లు.

ఇది కూడా చదవండి: Ambani: ముఖేష్‌ అంబానీ కుటుంబం యాంటిలియాలోని 27వ అంతస్తులో ఎందుకు నివసిస్తుంది?

ఇవి కూడా చదవండి

9 నెలల్లో 6.52 లక్షల కోట్లు:

మార్క్ జుకర్‌బర్గ్ సంపద 2024 మొదటి 9 నెలల్లో 78 బిలియన్ డాలర్లు పెరిగిందిజ అంటే దాదాపు రూ.6.52 లక్షల కోట్లు. మెటా షేర్‌లో 70% పెరుగుదల కారణంగా ఈ సంపద పెరిగింది. మెటా కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతపై పెట్టుబడిదారులు పెరిగాయి. దీని వల్ల మార్క్ జుకర్‌బర్గ్ బాగా లాభపడ్డారు.

AIలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెటా విజయానికి ఆజ్యం పోసింది. అంతకుముందు 2022లో కంపెనీ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత కాస్ట్ కటింగ్ కారణంగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించారు. అయితే, దీని తర్వాత కంపెనీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందింది మరియు కంపెనీ మళ్లీ స్థిరపడింది.

ఇది కూడా చదవండి: Top Schools: భారతదేశంలో అత్యంత ఖరీదైన టాప్-5 స్కూల్స్.. ఫీజు ఎంతో తెలిస్తే షాకవుతారు!

మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే తన కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రకటించారు. వచ్చే 20-30 ఏళ్లపాటు మెటా ప్రముఖ టెక్నాలజీ కంపెనీగా కొనసాగుతుంది. కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం వారి లక్ష్యం లాభార్జన మాత్రమే కాదు. తదుపరి 100 సంవత్సరాలలో మెటా కోసం ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించడం.

ప్రపంచంలోని టాప్ 5 ధనవంతులు:

  • ఎలాన్ మస్క్ – 256 బిలియన్ డాలర్లు (దాదాపు 21.40 లక్షల కోట్లు)
  • మార్క్ జుకర్‌బర్గ్- 206.2 బిలియన్ డాలర్లు (దాదాపు 17.22 లక్షల కోట్లు)
  • జెఫ్ బెజోస్- 205.1 బిలియన్ డాలర్లు (దాదాపు 17.13 లక్షల కోట్లు)
  • బెర్నార్డ్ ఆర్నాల్ట్- 203 బిలియన్ డాలర్లు (దాదాపు 16.96 లక్షల కోట్లు)
  • వారెన్ బఫెట్- 121.7 బిలియన్ డాలర్లు (దాదాపు 10.16 లక్షల కోట్లు)

ఇది కూడా చదవండి: LPG Cylinder: దీపావళికి ముందు మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఆ ప్రభుత్వం కీలక ప్రకటన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దళితుల ఇంట్లో వంట చేసిన రాహుల్ గాంధీ..!
దళితుల ఇంట్లో వంట చేసిన రాహుల్ గాంధీ..!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.