IPOs: ఐపీఓలపై ‘యుద్ధం’ ఎఫెక్ట్.. ఈ వారంలో లైన్లో ఉన్నది రెండే..

ప్రస్తుతం యుద్ధ మేఘాల నేపథ్యంలో కాస్త నెమ్మదించిన ఐపీఓ మార్కెట్.. భవిష్యత్తులో చాలా బాగుండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకు సెబీ వద్ద ఐపీఓ కోసం రిజిస్టర్ అయిన కంపెనీల జాబితాను ఉదాహరణగా చెబుతున్నారు. 26 కంపెనీలు సుమారు రూ. 72,000 కోట్లను సమీకరీంచేందుకు సెబీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందాయని వారు వివరిస్తున్నారు.

IPOs: ఐపీఓలపై ‘యుద్ధం’ ఎఫెక్ట్.. ఈ వారంలో లైన్లో ఉన్నది రెండే..
Ipo
Follow us
Madhu

|

Updated on: Oct 07, 2024 | 4:51 PM

ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదేలు చేస్తోంది. అక్కడి ప్రభావం మన దేశీయ మార్కెట్లపై కూడా తీవ్రంగా పడుతోంది. దీంతో సూచీలు గణనీయంగా పడిపోతున్నాయి. అంతేకాక ఇటీవల మంచి దూకుడు మీదున్న ఐపీఓలు కూడా ఈ ప్రభావానికి లోనవుతున్నట్లు కనిపిస్తున్నాయి. సెప్టెంబరులో 12 ప్రధాన కంపెనీలతో పాటు ఎంఎస్ఎంఈ(చిన్న, మధ్య స్థాయి సంస్థలు) విభాగంలో 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చి నిధులు సమీకరించాయి. అయితే అక్టోబర్ ప్రారంభం నుంచి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో యుద్ధ ప్రభావం కారణంగా ఐపీఓలు కూడా నెమ్మదించాయి. దీంతో ఈ వారంలో కేవలం రెండు సంస్థలు మాత్రమే ప్రధాన విభాగంలో ఐపీఓలకు వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఈ వారంలో రెండే..

ఈ వారంలో రెండు సంస్థలు ఐపీఓకు వచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ రెండు సంస్థలు కలిపి రూ. 365కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాటిల్లో గరుడ కన్ స్ట్రక్షన్ అండ్ ఇంజినీరింగ్ మెయిన్ బోర్డులో, శివ్ టెక్స్ కెమ్ ఎంఎస్ఎంఈ విభాగంలో పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. గరుడ్ కన్ స్ట్రక్షన్ ఇష్యూ పరిమాణం రూ. 264 కోట్లు కాగా.. ధర శ్రేణి రూ. 92 నుంచి 95 వరకూ ఉంది. అలాగే శివ్ టెక్స్ కెమ్ ఇష్యూ పరిమాణం రూ. 101 కోట్లు కాగా, ధరల శ్రేణి రూ. 158 నుంచి రూ. 166 వరకూ ఉంటుంది. ఇష్యూ తేదీలు అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 10 వరకూ.

అలాగే ఈ నెల 4న ప్రారంభమైన ఖ్యాతి గ్లోబల్ వెంచర్స్ ఐపీఓ 8న ముగియనుంది. అదే విధంగా ఎస్ఎంఈ విభాగంలో ఆరు కంపెనీ షేర్లు ఈ వారం స్టాక్ ఎక్స్ చేంజ్లో నమోదుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 7నహెచ్ వ్యాక్స్ టెక్నాలజీస్, సాజ్ హోటల్స్, షేర్లు, ఈ నెల 8న సుబమ్ పేపర్స్, పారమౌంట్ డై టెక్ , 9న నియో పొలిటన్ పిజా అండ్ ఫుడ్స్, 11న గ్లోబల్ వెంచర్స్ షేర్లు నమోదు కానున్నాయి.

భవిష్యత్ సూపర్..

ప్రస్తుతం యుద్ధ మేఘాల నేపథ్యంలో కాస్త నెమ్మదించిన ఐపీఓ మార్కెట్.. భవిష్యత్తులో చాలా బాగుండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకు సెబీ వద్ద ఐపీఓ కోసం రిజిస్టర్ అయిన కంపెనీల జాబితాను ఉదాహరణగా చెబుతున్నారు. 26 కంపెనీలు సుమారు రూ. 72,000 కోట్లను సమీకరీంచేందుకు సెబీ నుంచి ఇప్పటికే అనుమతులు పొందాయని వారు వివరిస్తున్నారు. అంతేకాక మరో 55 కంపెనీలు సుమారు రూ. 89,000 కోట్లు సమీకరించుకునేందుకు సెబీ అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు కొన్ని ఆన్ లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఇప్పటి వరకూ ఈ ఏడాదిలో 63 ప్రధాన కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు 64,000 కోట్ల నిధులను సమీకరించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!