Edible Oil: దీపావళికి ముందు గుడ్‎న్యూస్.. తగ్గిన వంట నూనె ధరలు.. ఎంత తగ్గాయంటే..

పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అదానీ విల్మార్, రుచి సోయా ఇండస్ట్రీస్‌తో సహా ప్రధాన ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు టోకు ధరలను లీటరుకు రూ. 4-7 తగ్గించాయి. ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయని భావిస్తున్నామని పరిశ్రమ బాడీ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ మంగళవారం తెలిపింది...

Edible Oil: దీపావళికి ముందు గుడ్‎న్యూస్.. తగ్గిన వంట నూనె ధరలు.. ఎంత తగ్గాయంటే..
Oil
Follow us

|

Updated on: Nov 03, 2021 | 7:59 AM

పండుగ సీజన్‌లో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అదానీ విల్మార్, రుచి సోయా ఇండస్ట్రీస్‌తో సహా ప్రధాన ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు టోకు ధరలను లీటరుకు రూ. 4-7 తగ్గించాయి. ఇతర కంపెనీలు కూడా దీనిని అనుసరిస్తాయని భావిస్తున్నామని పరిశ్రమ బాడీ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ మంగళవారం తెలిపింది. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్), మోడీ నేచురల్స్ (ఢిల్లీ), గోకుల్ రీఫాయిల్స్ అండ్ సాల్వెంట్ లిమిటెడ్ (సిధ్‌పూర్), విజయ్ సోల్వెక్స్ లిమిటెడ్ (అల్వార్) గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, ఎన్‌కె. ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్) ధర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

పండుగ సీజన్‌లో అధిక ధరల నుండి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు SEA దాని సభ్యులకు అదే విధంగా విజ్ఞప్తి చేయడంతో ఈ కంపెనీలు టోకు ధరలను తగ్గించాయి. “పరిశ్రమ నుండి వచ్చిన స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది” అని SEA ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. వారు ఇప్పటికే హోల్‌సేల్ బల్క్ ధరలను టన్నుకు రూ. 4,000-7,000 (లీటరుకు రూ. 4-7) తగ్గించారు. ఈ సంవత్సరం దేశీయ సోయాబీన్, వేరుశెనగ పంటలు పుంజుకుంటున్నాయని చతుర్వేది చెప్పారు.

ఇది కాకుండా, ప్రపంచ ఆహార చమురు సరఫరా పరిస్థితి మెరుగుపడుతోందని.. ఇది అంతర్జాతీయ ధరలను మరింత చల్లబరుస్తుందని చెప్పారు. తద్వారా తదుపరి వివాహ సీజన్‌లో దేశీయ ధరలు మరింత తగ్గుతాయని ఆయన తెలిపారు. ఇండోనేషియా, బ్రెజిల్ ఇతర దేశాలలో జీవ ఇంధనం కోసం మళ్లించిన తరువాత ఆహార వినియోగం కోసం తినదగిన నూనెల లభ్యత తగ్గిన కారణంగా అంతర్జాతీయ మార్కెట్‎లో ధరలు పెరిగినందున దేశీయంగా పెరిగాయని తెలిపారు. భారతదేశం వంట నూనెల డిమాండ్‌లో 60 శాతానికి పైగా దిగుమతులు చేసుకుంటుందని.. ప్రపంచ ధరలలో ఏదైనా పెరుగుదల స్థానిక ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ధరలను తగ్గించడానికి అక్టోబర్ రెండో వారంలో దిగుమతి సుంకాలను తగ్గించారని చెప్పారు.

Read Also.. Diwali Muhurat trading 2021: ముహూరత్ ట్రేడింగ్ అంటే తెలుసా.. అది ఎప్పుడు నిర్వహిస్తారంటే..