Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali Muhurat trading 2021: ముహూరత్ ట్రేడింగ్ అంటే తెలుసా.. అది ఎప్పుడు నిర్వహిస్తారంటే..

దీపావళి రోజున ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ రోజు షేర్లు కొనుగోలు చేస్తే.. మళ్లీ వచ్చే దీపావళి నాటికి సంపంద పెరుగుతుందనేది చాలా మంది నమ్మకం. ఈ దీపావళికి కూడా ముహూరత్ ట్రేడింగ్ సేషన్ నిర్వహించనున్నారు...

Diwali Muhurat trading 2021: ముహూరత్ ట్రేడింగ్ అంటే తెలుసా.. అది ఎప్పుడు నిర్వహిస్తారంటే..
stock market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 03, 2021 | 7:37 AM

దీపావళి రోజున ముహూరత్ ట్రేడింగ్ నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఆ రోజు షేర్లు కొనుగోలు చేస్తే.. మళ్లీ వచ్చే దీపావళి నాటికి సంపంద పెరుగుతుందనేది చాలా మంది నమ్మకం. ఈ దీపావళికి కూడా ముహూరత్ ట్రేడింగ్ సేషన్ నిర్వహించనున్నారు. ముహూరత్ ట్రేడింగ్ అనేది ఒక గంట ప్రత్యేక సెషన్ అన్నమాట. పెట్టబడిదారులు అనుసరిస్తున్న ఆచారం ఇది. ఈ సెషన్‎లోని టైమ్ ఫ్రేమ్ ప్రతి ఏటా అత్యంత పవిత్రమైన గంటగా భావిస్తారు ఇన్వెస్టర్లు. ఈ ముహూరత్ సెషన్ ప్రారంభానికి ముందు స్టాక్ మార్కెట్లో ట్రేడర్లు పూజ కూడా చేస్తారు. అంతేకాదు సాయంత్రం సమయంలో బీఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఈలలో ప్రత్యేకంగా ఓ గంటసేపు ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. ఈ సెషన్‌లో షేర్లను కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని విశ్వాసం. నవంబర్ 4 గురువారం దీపావళి రోజున ప్రీ ఓపెనింగ్ సెషన్ సాయంత్రం 6 నుంచి 6:08 గంటల మధ్య జరుగుతుంది. ప్రధాన సెషన్ సాయంత్రం 6:15 గంటల నుంచి 07:15 వరకు కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం సెషన్‌లో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో స్టాక్‌లను కలుపుతారు.

ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడు మెుదలైంది.

ప్రధాన వాణిజ్య వర్గాలైన గుజరాతీలు, మార్వాడీలు ముహూరత్ ట్రేడింగ్‎ను ప్రారంభించారు. ప్రతి దీపావళి సందర్భంగా ఈ రకమైన సెషన్‎లో వారు పాల్గొంటారు. ఈ సంప్రదాయం 1992 లో ఎన్‌ఎస్‌ఈలో ప్రారంభమైంది. తరువాత, బీఎస్ఈలో కూడా ప్రారంభమైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీపావళికి ముహూరత్ సెషన్ ప్రారంభమయ్యే ముందు వ్యాపారవేత్తలు అకౌంటింగ్ పుస్తకాన్ని ఆరాధిస్తారు. ముహురత్ అనే పదానికి ఒక ముఖ్యమైన పనిని నిర్వహించడానికి అనుకూలమైన నిర్దిష్ట కాల వ్యవధి అని అర్థం. సెషన్‌లో జరిగే ట్రేడ్‌లు సాధారణ ట్రేడ్‌ల మాదిరిగానే ఉంటాయి. ఎక్స్‌ఛేంజీల పనిలో వారి సాధారణ సమయాలకు మినహా ఎలాంటి మార్పు ఉండదు. రేపు జరగబోయే ముహూరత్ ట్రేడింగ్ లో షేర్లు కొనుగోలు చేయడానకి మదుపర్లు రెడీగా ఉన్నారు.

Read Also.. NASSCOM: వారంలో మూడు రోజులు ఆఫీస్‎కి.. హైబ్రిడ్‌ పని విధానానికే మొగ్గు చూపుతున్న ఐటీ ఉద్యోగులు, యాజమాన్యాలు..