Gas Cylinder Expiry Date: గ్యాస్‌ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందని మీకు తెలుసా..? గుర్తించడం ఎలా..?

Gas Cylinder Expiry Date: వంట గ్యాస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే క్షేమంగా ఉంటాం. చాలా మందికి అసలు వంట గ్యాస్ సిలిండర్..

Gas Cylinder Expiry Date: గ్యాస్‌ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందని మీకు తెలుసా..? గుర్తించడం ఎలా..?
Gas Cylinder Expiry Date
Follow us
Subhash Goud

|

Updated on: Mar 29, 2022 | 12:57 PM

Gas Cylinder Expiry Date: వంట గ్యాస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే క్షేమంగా ఉంటాం. చాలా మందికి అసలు వంట గ్యాస్ సిలిండర్ నిర్వహణ, సిలిండర్‌ (Cylinder)కు సంబంధించిన కొన్ని విషయాలు అసలే తెలియవు. కొంత మందికి తెలిసినా చాలా మందికి తెలిసి ఉండదు. ముఖ్యంగా ప్రతీ వంట గ్యాస్ (Gas) సిలిండర్ పై ఎక్స్ పయిరీ తేదీ (Expiry Date) ఉంటుందన్న విషయం తెలిసిన వారు అతి కొద్ది మందే. ఈ గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీలు ఏర్పడవచ్చు. ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి వంటగ్యాస్‌పై ఎక్స్ పయిరీ తేదీ విషయం పౌర సరఫరాల శాఖ అధికారుల్లోనూ అందరికీ తెలియదు. ప్రతీ సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ వలే ఉంటుంది. దానికి సిలిండర్‌కు సపోర్టెడ్‌గా మూడు ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లపై లోపలి వైపు అంకెలు వేసి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ మూడింటిలో ఒక దానిపై ఆ సిలిండర్ ఎక్స్ పయిరీ తేదీ కూడా ఉంటుంది. దీనిపై సంవత్సరం, నెల వివరాలు ఉంటాయి.

ఎక్స్ పయిరీ గడువు ఎలా తెలుసుకోవడం.. సిలిండర్ పై ఉన్న మెటల్ ప్లేట్లలో ఒకదానిపై లోపలివైపు ఈ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంట్లో సిలిండర్ పై A 22 అని ఉందనుకోండి. కచ్చితంగా అదే ఎక్స్ పయిరీ తేదీ. A 22 అంటే జనవరి నుంచి మార్చి, 2022వరకు అని అర్థం. సిలిండర్ ఆ సంవత్సరం మొదటి త్రైమాసికం చివరితో గడువు తీరిపోతుందని అర్థం. మార్చి తర్వాత తిరిగి పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాతే పంపిణీకి రావాల్సి ఉంటుంది. B అంటే ఏప్రిల్ – జూన్ అని C – అంటే జూలై – సెప్టెంబర్ వరకు అని, D -అంటే అక్టోబర్ – డిసెంబర్ వరకు అని అర్థం.

ఇలా చేస్తే ఎలా తెలుస్తుంది..? కస్టమర్లలో అవగాహన తక్కువే కనుక గ్యాస్ కంపెనీలు గడువు తీరిన వెంటనే అన్ని సిలిండర్లను విధిగా పరీక్షలకు పంపడం అనేది ఎంతో ముఖ్యం. కొన్ని అలా పంపడం లేదనే వాదన ఉంది. వెసులుబాటును బట్టి పంపిస్తుంటారు. అవగాహన పెరిగి ప్రశ్నించడం ఎక్కువైతే అప్పుడు గడువు దాటిన సిలిండర్లను మార్కెట్లోకి పంపించేందుకు గ్యాస్ కంపెనీలు సాహసం చేయలేవు. ప్రస్తుతం అవగాహన తక్కువే కనుక ఇలా చేసే అవకాశం ఉంటుంది.

ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చిన తర్వాత.. పైన సీల్ ను చెక్ చేసుకోవాలి. సేఫ్టీ క్యాప్‌కు ఎటువంటి క్రాక్స్ ఉండరాదని నిబంధనలు చెబుతున్నాయి. క్యాప్ తెరచి లీకేజీ ఉందేమో పరీక్షించాలి. వేలితో వాల్వ్ ను మూసి ఉంచినట్టయితే.. లీకేజీ ఉంటే లీక్ అయిన గ్యాస్ వేలిని పైకి నెడుతుంది. లీకేజీ ఉంటే కనుక ఆ సిలిండర్ ను తీసుకోవద్దు. అలాగే, గడువు దాటిన సిలిండర్‌ను కూడా తీసుకోవద్దు.

ఇవి కూడా చదవండి:

Aadhaar Card: పాస్‌పోర్టు ఉంటే వారు కూడా ఆధార్‌ కార్డు పొందవచ్చు..!

LPG Gas: గ్యాస్‌ సిలిండర్ వాడే వారికి గుడ్‌న్యూస్‌.. కేంద్రం సరికొత్త నిర్ణయం..!

భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య.. కారణం ఏంటంటే..
భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిన భార్య.. కారణం ఏంటంటే..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
RR: రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే !
RR: రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే !
ఇదేం ఖర్మరా బాబు.. ఆ 5గురికి హ్యాండిచ్చిన ఫ్రాంచైజీలు
ఇదేం ఖర్మరా బాబు.. ఆ 5గురికి హ్యాండిచ్చిన ఫ్రాంచైజీలు
పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న వర్మ.. ప్రస్తుతం అక్కడే ఉన్నాడా?
పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న వర్మ.. ప్రస్తుతం అక్కడే ఉన్నాడా?
వీటితో టైమ్‌పాస్‌ మాత్రమే కాదండోయ్.. రోజూ గుప్పెడు తింటే చాలు..
వీటితో టైమ్‌పాస్‌ మాత్రమే కాదండోయ్.. రోజూ గుప్పెడు తింటే చాలు..
ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరు?
ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరు?
భారత జీడీపీ ఆశ్చర్యకర వృద్ధి..మరింత పెరిగే అవకాశం
భారత జీడీపీ ఆశ్చర్యకర వృద్ధి..మరింత పెరిగే అవకాశం
అమ్మబాబోయ్.. స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగిస్తున్నారా..?
అమ్మబాబోయ్.. స్మార్ట్‌ఫోన్‌ను గంటల తరబడి ఉపయోగిస్తున్నారా..?
క్షణాల్లో అగ్నికి ఆహుతైన ఖరీదైన జీప్‌ థార్‌.. అసలేం జరిగిందీ.?
క్షణాల్లో అగ్నికి ఆహుతైన ఖరీదైన జీప్‌ థార్‌.. అసలేం జరిగిందీ.?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..