Vijay-Rashmika: విజయ్-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్..
టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి ఈ జంట తమ పర్సనల్ లైఫ్‌లో చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దాంతో విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా రూమర్స్ ఉన్నాయి. అయితే, ఈ జంట మాత్రం తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెబుతూ వస్తోంది.
తాజాగా ఈ జోడీకి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. రెస్టారెంట్‌లో వీరిద్దరూ కనిపించారు. ఎవరో ఈ ఫొటో సీక్రెట్‌గా తీసి షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ ఇటీవల సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించారు. ఈ ఆల్బమ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రౌడీబాయ్ తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను సింగిల్ కాదన్నాడు. తనకు 35 ఏళ్లు వచ్చాయని, తాను ఇంకా సింగిల్‌గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించాడు. దాంతో విజయ్ ప్రస్తుతం రష్మికతో డేటింగ్‌లో ఉన్నాడన్న విషయం మరోసారి వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే విజయ్, రష్మిక కలిసి ఒక రెస్టారెంట్‌లో లంచ్ కు వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. వీరిద్దరూ కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ ఫొటోలు చూస్తుంటే.. ఈ జంట ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరి సినిమాల విషయానికి వస్తే.. గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 5న ఇది విడుదల కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.